ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 58.25 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

కోలుకున్నవారు 97.63%; 2020 మార్చి తరువాత ఇదే అత్యధికం

గత 24 గంటల్లో 25,072 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,33,924); ఇది155 రోజుల అత్యల్పం
చికిత్సలో ఉన్నవి మొత్తం కేసుల్లో 1.03%. మార్చి 2020 తరువాత అత్యల్పం

రోజువారీ పాజిటివిటీ 1.94%, 28 రోజులుగా 3% లోపు

Posted On: 23 AUG 2021 11:50AM by PIB Hyderabad

భారత దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 58.25 కోట్లు దాటి 58,25,49,595 కి చేరినట్టు ఎఎ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఇది సాధించటానికి ఇప్పటిదాకా మొత్తం 64,69,222 శిబిరాలు నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,53,405

2nd Dose

82,15,000

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,83,04,397

రెండో డోస్

1,25,74,264

18-44 వయోవర్గం

మొదటి డోస్

21,69,00,386

రెండో డోస్

1,94,77,956

45-59 వయోవర్గం

మొదటి డోస్

12,26,16,599

రెండో డోస్

4,87,88,970

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

8,33,38,747

రెండో డోస్

4,19,79,871

Total

58,25,49,595

 

టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో 44,157 మంది బాధితులు కోలుకోగా ఇప్పటిదాకా  3,16,80,626 మందికోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.63% కు చేరుకోవటం విశేషం. 2020 మార్చి నుంచి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం

 

 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా   160 రోజుల కనిష్ఠంగా 25,072 కొత్త కేసులు నమోదయ్యాయి. 57  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

పెద్ద సంఖ్యలో కోలుకున్నవారు నమోదవటం, కొత్త కేసులు తక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ 3,33,924 కి చేరింది. ఇది   155  రోజుల అత్యల్పం. మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవి  ప్రస్తుతం  1.03% మాత్రమే. ఇది మార్చి 2020 తరువాత  అత్యల్పం.

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 12,95,160 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 50.75 కోట్లకు పైగా (50,75,51,399) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  1.91% కాగా ఇది 59    రోజులుగా 3% లోపు ఉంటోంది.  రోజువారీ పాజిటివిటీ  1.94 % కు చేరగా వరుసగా 268    రోజులుగా 3% లోపు,  77  రోజులుగా 5% లోపే ఉంటోంది

 

***

 


(Release ID: 1748199) Visitor Counter : 217