ఉక్కు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను పుర‌స్క‌రించుకొని వివిధ పోటీల‌ను నిర్వ‌హించిన ఉక్కు మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెయిల్ = బిఎస్‌పి, సెయిల్‌- విఐఎస్ఎల్‌

Posted On: 19 AUG 2021 2:07PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను పుర‌స్క‌రించుకొని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని మ‌హార‌త్న సిపిఎస్ఇ అయిన సెయిల్ (SAIL) భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇండియా @75 అన్న అంశంపై క్విజ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎంటిటి బ్యాచ్ -2021కి చెందిన మేనేజ్ మెంట్ ట్రైనీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎస్ కె దూబే, ఇడి (పి&ఎ) క్విజ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇండియా @75 అన్న అంశంపై వేసిన ఆస‌క్తిక‌ర‌మైన‌, స‌మాచారంతో కూడిన ప్ర‌శ్న‌ల‌కు క్విజ్ లో పాలు పంచుకున్న అభ్య‌ర్ధులు స‌మాధానాలు చెప్పారు.  
సెయిల్‌-విఐఎస్ఐఎల్ ప్లాంట్ లో, స్వాతంత్య్ర దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని భ‌ద్రావ‌తిలోని విఐఎస్ఎల్ సిల్వ‌ర్ జూబిలీ స్టేడియంలో ఉత్సాహ, ఉత్తేజాల‌తో జ‌రుపుకున్నారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను పుర‌స్క‌రించుకుని జ‌రుపుకున్న వేడుక‌ల‌లో భాగంగా ప్లాంట్ లో దేశ‌ భ‌క్తి గీతాల, ముగ్గుల పోటీల‌ను  నిర్వ‌హించారు.

***
 



(Release ID: 1747556) Visitor Counter : 241