విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సహజ విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలుకు సంబంధించి రూపొందించిన ముసాయిదా నిబంధనలను రూపొందించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ
ప్రజల అభిప్రాయాల కోసం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన విద్యుత్ మంత్రిత్వ శాఖ
Posted On:
16 AUG 2021 2:17PM by PIB Hyderabad
సహజ విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలుకు సంబంధించి విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలను రూపొందించింది."డ్రాఫ్ట్ విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం) నియమాలు, 2021" పేరిట రూపొందించిన ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయం కోరుతూ వీటిని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ https://powermin.gov.in/ లో ఉంచారు. వీటిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలను పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది.
వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే యూనిట్లతో సహా ఇతర సహజ ఇంధన వనరుల వినియోగం, కొనుగోలుకు ఈ నిబంధనలను వర్తిస్తాయి. పునరుద్ధరించదగిన కొనుగోలు బాధ్యత , గ్రీన్ ఎనర్జీ బహిరంగ లభ్యత, నోడల్ ఏజెన్సీలు, గ్రీన్ ఎనర్జీని బహిరంగ వినియోగానికి మంజూరు చేసే విధానం, బ్యాంకింగ్ మరియు క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జ్ అనే నాలుగు ఉపశీర్షికలతో సిద్ధం చేశారు.
'గ్రీన్ ఎనర్జీ కి సంబంధించిన ధరను అధీకృత కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ ధర పునరుత్పాదక ఇంధన కొనుగోలు వ్యయం, క్రాస్-సబ్సిడీ ఛార్జీలు (ఏదైనా ఉంటే), పంపిణీ లైసెన్సుల సేవా ఛార్జీల సగటు ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది' అని ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు.
పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ ను నిబంధనలు ప్రకారం 'గ్రీన్ హైడ్రోజన్ గా' పరిగణిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ను కొనుగోలు చేయడం ద్వారా కూడా పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించ వలసిన బాధ్యత కలిగి ఉన్న సంస్థలు తమ బాధ్యతను పూర్తి చేయవచ్చును. పునరుత్పాదక వనరులను ఉపయోగించి ఉత్పత్తి అయ్యే ఒక ఎండబ్ల్యుహెచ్ విద్యుత్ కు సమానంగా గ్రీన్ హైడ్రోజన్ పరిమాణాన్ని లెక్కిస్తారు. ఈ నిబంధనలను కేంద్ర కమిషన్ తరువాత ప్రకటిస్తుంది.
ఈ ముసాయిదా నియమాల్లో గ్రీన్ ఎనర్జీ బహిరంగ వినియోగంపై మార్గదర్శకాలను కూడా ప్రతిపాదించారు. వినియోగించడానికి సిద్ధంగా ఉన్నవినియోగదారులకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసే అంశంపై సంబంధిత కమిషన్ నిబంధనలను రూపొందించి అమలు చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ బహిరంగ వినియోగం కోసం అందిన దరఖాస్తులకు గరిష్టంగా 15 రోజుల్లో అనుమతులు జారీ చేయబడతాయి. వంద కిలోవాట్ మరియు అంతకన్నా ఎక్కువ డిమాండ్/మంజూరు చేయబడిన లోడ్ కలిగిన వినియోగదారులు మాత్రమే గ్రీన్ ఎనర్జీ ని బహిరంగ విధానం ద్వారా తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. బహిరంగ విధానం ద్వారా తీసుకునే గ్రీన్ ఎనర్జీ సరఫరాపై ఎటువంటి పరిమితి ఉండదు.అయితే, డిమాండ్ ను తట్టుకోవడానికి వీలుగా బహిరంగ విధానం ద్వారా తీసుకునే గ్రీన్ ఎనర్జీ వినియోగం పై పరిమితులు విధించకుండా దానిని వినియోగించే సమయాలను సహేతుకంగా నిర్ణయించవలసి ఉంటుంది.
ముసాయిదా నియమాలు కింది అనుబంధంలో ఇవ్వబడ్డాయి.
The draft rules are given as annexure:
(Release ID: 1746574)
Visitor Counter : 224