హోం మంత్రిత్వ శాఖ

2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్నిమాపక సిబ్బందికి, హోంగార్డులకు, పౌర రక్షణ సిబ్బందికి రాష్ట్రపతి పతకాలు ప్రదానం

Posted On: 14 AUG 2021 12:32PM by PIB Hyderabad

స్వాతంత్ర్య, గణతంత్ర్య  దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డులు, పౌర రక్షణ సిబ్బంది విశిష్ట సేవల గుర్తింపుగా రాష్ట్రపతి పతకాలు, శౌర్యపతకాలు,  విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేస్తారు.


2021 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అగ్నిమాపక దళంలో 86 సిబ్బందికి ఫైర్ సర్వీసెస్ మెడల్స్ప్రకటించారు.


ఇందులో అగ్నిమాపక దళంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన 26 మందికి ఫైర్ సర్వీసెస్ మెడల్స్ప్రకటించారు.


విశిష్ట సేవా ప్రతిభను కనబర్చిన మరో 10 మంది ఫైర్ సిబ్బందికి రాష్ట్రపతి ఫైర్ సర్వీసెస్ మెడల్స్ ప్రకటించారు. అసమాన ప్రతిభ కనబర్చిన మరో 50 మంది అగ్నిమాపక దళ సిబ్బందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు.

వీటికి అదనంగా మరో 55 మంది  హోంగార్డులు, పౌర రక్షణ సిబ్బందికి కూడా 2021, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పతకాలను ప్రకటించారు. ఇందులో హోంగార్డులు, పౌర రక్షణ సిబ్బందిలో ఐదుగురికి రాష్ట్రపతి పతకాలు ప్రకటించగా.. మిగతా 50 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు.

అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డులు, పౌర రక్షణ దళంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

 The list of Fire Service Medals and  Home Guards & Civil Defence Medals awardees are enclosed as Annexure. 


(Release ID: 1745968) Visitor Counter : 205