ప్రధాన మంత్రి కార్యాలయం

మన ప్రజల పోరాటాలు.. త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14ను భయానక విభజన సంస్మరణ దినంగా పాటిద్దాం: ప్రధానమంత్రి

Posted On: 14 AUG 2021 10:54AM by PIB Hyderabad

   మన ప్రజల పోరాటాలు... త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14ను ‘భయానక విభజన సంస్మరణ దినం’గా పాటిద్దామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వరుస సందేశాల్లో ప్రధాని కింది విధంగా చెప్పారు.

   “విభజన వేదనను ఎన్నటికీ మరువలేం. ఈ కల్లోలంలో మన లక్షలాది సోదరీసోదరులు చెల్లాచెదరయ్యారు. మతిలేని హింసాద్వేషాలకు అనేకమంది నిలువునా బలైపోయారు. ఆనాటి మన ప్రజల పోరాటాలు, త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14ను మనం ‘భయానక విభజన సంస్మరణ దినం’గా పాటిద్దాం. ఈ మేరకు సామాజిక విభజన, విద్వేషమనే విష భావనలను నిర్మూలించి ఐకమత్య స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, మానవ సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని #PartitionHorrorsRemembranceDay మనకు సదా గుర్తుచేస్తూనే ఉండాలని ఆకాంక్షిద్దాం.”

 

***

 

***

DS/SH


(Release ID: 1745749) Visitor Counter : 233