పర్యటక మంత్రిత్వ శాఖ

50 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. పర్యాటకరంగంలో భారీ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి: జి. కిషన్ రెడ్డి

Posted On: 09 AUG 2021 4:11PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ 50 కోట్ల డోసుల మైలురాయిని దాటడం పర్యాటకరంగంలో భారీ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఈశాన్యప్రాంత పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధిశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
‘‘ మా దేశ ప్రజలు, ఆరోగ్య సిబ్బంది, ప్రధానమంత్రి నరేంద్రమోదీ  సమష్టి కృషితో ..50 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ ద్వారా కరోనా మహమ్మారి పరిస్థితుల్లో  కూడా భారత్ ఎదుగుతోందని మేము ప్రపంచానికి నిరూపించాము. # సబ్ కో వ్యాక్సిన్ ముఫ్ట్ వ్యాక్సిన్”అని మంత్రి ట్వీట్ చేశారు.
ట్వీట్ లింక్:
https://twitter.com/kishanreddybjp/status/1423674302314868741?s=20
పర్యాటక రంగం పునురుద్ధరణలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి అన్నారు. ‘సార్వత్రిక టీకా కార్యక్రమం కేవలం పర్యాటకరంగం పురోభివృద్ధికే కాకుండా విదేశీ పర్యాటకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా సాయపడుతుంది. అంతేకాకుండా దేశీయ పర్యాటకరంగానికి కూడా మంచి మద్దతు లభిస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందడానికి  పర్యాటకరంగంలో భాగస్వాములైనవారంతా వ్యాక్సినేషన్ కోసం ముందుకు రావాలని, సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన జాగ్రత్తలను, ప్రోటోకాల్ను అంతా తప్పకుండా పాటించాలని, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పక పాటించాలని నొక్కి చెప్పారు.

ప్రధాన మంత్రి నాయకత్వంలో తీసుకున్న అనేక చురుకైన చర్యల కారణంగా టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగవంతంగా కొనసాగుతోందని కూడా కేంద్రమంత్రి పేర్కొన్నారు.  “ దూరదృష్టి కలిగిన ప్రధానమంత్రి నాయకత్వంలో మా ప్రభుత్వం నిర్విరామంగా చేస్తున్న ప్రయత్నాల కారణంగానే మనం ఈరోజు ఈ ఫలితాలను చూస్తున్నాం. టీకా అభివృద్ధికి ప్రభుత్వం ఓ ఇంక్యుబేటర్గా పనిచేసింది. ఫలితంగానే ప్రతిరోజూ ఇంతర దేశాలకంటే ఎక్కువ సంఖ్యలో మనం టీకాలను వేయగలుగుతున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

ఫ్రంట్ లైన్ కార్మికులు మరియు ఇతర వైద్య సిబ్బంది చేసిన పనిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. "డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తలందరికీ నేను సెల్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రారంభించకముందే మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేలా ‘సురక్ష కవచం’లా నిలిచారు’ అని మంత్రి పేర్కొన్నారు.

జూన్ 21, 2021 నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక టీకార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం ద్వారా దేశ ప్రజల్లో భద్రతాభావం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ‘చివరి 10 కోట్ల వ్యాక్సిన్‌లను ఇవ్వడానికి మాకు కేవలం 20 రోజులు మాత్రమే పట్టింది. సార్వత్రిక టీకా కార్యక్రమం దిశగా ప్రభుత్వం ఎంత చురుకుగా పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేయడానికి ఇది నిరదర్శనంగా నిలుస్తుంది’ అని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

***

 



(Release ID: 1744528) Visitor Counter : 164