రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రష్యాలో నిర్వహించనున్న అంతర్జాతీయ సైనిక క్రీడలు-2021లో పాల్గొననున్న భారత బృందం

Posted On: 09 AUG 2021 9:56AM by PIB Hyderabad

ఈ నెల 22 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు రష్యాలో జరగనున్న 'అంతర్జాతీయ సైనిక క్రీడల్లో' పాల్గొనేందుకు భారత సైన్యానికి చెందిన 101 సభ్యుల బృందం రష్యాకు వెళ్లనుంది. ఆర్మీ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్‌ (ఏఎస్‌ఎంసీ), ఎల్బ్రస్‌ రింగ్‌, పోలార్‌ స్టార్‌, స్నిపర్‌ ఫ్రాంటియర్‌, సేఫ్‌ రూట్‌ పోటీల్లో భారత బృందం పాల్గొంటుంది. ఎత్తైన పర్వత భూ భాగాల్లో, మంచులో విన్యాసాలు, స్నిపర్ ఆపరేషన్లు, అడ్డంకులతో నిండిన ప్రాంతాల్లో పోరాట ఇంజినీరింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే ఆటలు ఈ క్రీడా సంగ్రామంలో జరుగుతాయి. ఓపెన్ వాటర్, ఫాల్కన్ హంటింగ్‌ క్రీడల్లోనూ భారత బృంద సభ్యులు పాల్గొంటారు. పాంటూన్‌ వంతెనల నిర్మాణం, యూఏవీ సిబ్బంది నైపుణ్యాలను ఇందులో ప్రదర్శిస్తారు.

    మూడంచెల పరిశీలనల తర్వాత, వివిధ విభాగాల్లో భారత సైన్యాన్ని ఉత్తమ బృందంగా ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా, భారత సైన్యం సత్తా ప్రపంచ దేశాల సైన్యాలకు తెలుస్తుంది. వివిధ దేశ సైన్యాల మధ్య సహకారాన్ని కూడా ఈ క్రీడలు ప్రోత్సహిస్తాయి. జైసల్మేర్‌లో జరిగిన ఆర్మీ స్కౌట్స్ మాస్టర్ కాంపిటీషన్-2019లో పాల్గొన్న ఎనిమిది దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది.

***


(Release ID: 1743970) Visitor Counter : 248