జౌళి మంత్రిత్వ శాఖ

చేనేత మంత్రిత్వ శాఖ 7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 07,2021 న జరుపుకుంటుంది

కనిహమ, జమ్ము అండ్ కశ్మీర్, మరియు కోలాం, కేరళ మరియు మోహపారా, అస్సాంలోని గోలాఘాట్‌లలోని చేనేత క్రాఫ్ట్ గ్రామాల ప్రదర్శన

తమిళనాడులోని కాంచీపురంలో డిజైన్ రిసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవం;

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్‌లో వీవర్స్ సర్వీస్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభోత్సవం;

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ద్వారా వర్చువల్ బయ్యర్ సెల్లర్ మీట్;

ఆగష్టు 7 నుండి 11 వరకు మరియు 2021 ఆగస్టు 19 నుండి 22 వరకు చేనేతలపై విద్యార్థులు మరియు సాధారణ ప్రజల కోసం మైగవ్‌ పోర్టల్‌లో ప్రత్యేకమైన క్విజ్

Posted On: 06 AUG 2021 1:37PM by PIB Hyderabad

 

టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఆగష్టు 07, 2021 న 7 వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున చేనేత నేత సమాజం గౌరవించబడుతుంది మరియు ఈ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఆ రంగం యొక్క సహకారం ప్రత్యేకంగా గుర్తు చేయబడుతుంది. మన చేనేత వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పం మరియు చేనేత నేత కార్మికులకు అధిక అవకాశాలు కల్పించడం వంటి చర్యల తీసుకొనబడతాయి. ఈ సంవత్సరం టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలోని  చాణక్యపురి కన్వెన్షన్ సెంటర్‌లో దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర జౌళి, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు జౌళి మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శనార్దోష్ పాల్గొంటారు. సెక్రటరీ టెక్స్‌టైల్స్, శ్రీ యుపి సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక జాతిగా మనమందరం భారతీయ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మరియు #MyHandloomMyPride తో అనుబంధం కొనసాగించడం ద్వారా వారి గొప్పతనాన్ని ప్రదర్శించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

మన దేశం యొక్క గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్న చేనేత.. మన దేశంలోని గ్రామీణ మరియు సెమీ గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని అందించే ఒక ముఖ్యమైన రంగంగా నిలుస్తోంది. ఇది 70% పైగా చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులు మహిళలతో మహిళా సాధికారతను నేరుగా అందించే రంగం ఇది. స్వాతంత్రం కోసం మనం జరిపిన పోరాటంలో నిర్వహించిన ఉద్యమాలలో ఒకటి స్వదేశీ ఉద్యమం. ఇది ఆగష్టు 7, 1905 న ప్రారంభించబడింది. ఈ ఉద్యమం స్వదేశీ పరిశ్రమలను మరియు స్వదేశీ స్ఫూర్తిని ప్రోత్సహించింది. ఇందులో చేనేత, నేత కార్మికులు కూడా ఉన్నారు. 2015 లో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న తేదీని జాతీయ చేనేత దినోత్సవం (ఎన్‌హెచ్‌డి) గా ప్రకటించాలని నిర్ణయించింది. అప్పటి నుండి వారణాసి, గౌహతి, జైపూర్ మరియు భువనేశ్వర్‌లో ఎన్‌హెచ్‌డి వేడుకలు జరుగుతున్నాయి. చేనేత రంగం యొక్క స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి భారత ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుంది. తద్వారా మన చేనేత కార్మికులు మఆర్థికంగా సాధికారత పొందుతారు. మరియు వారి సున్నితమైన హస్తకళలో గొప్పతనాన్ని నింపారు.

కోవలం, తిరువనంతపురం, కేరళ, మొహపారా గ్రామం, గోలాఘాట్ జిల్లా, అస్సాం మరియు కనిహామా, బుడ్గాం, శ్రీనగర్‌లలో మూడు చేనేత క్రాఫ్ట్ గ్రామాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రదేశాలలో క్రాఫ్ట్ గ్రామాలను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న లక్ష్యం..దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులకు అదనపు ఆకర్షణను అందించడం మరియు ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ చేనేత & హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహించడం.

న్యూఢిల్లీలో 7 వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కింది కార్యకలాపాలు ప్రణాళిక చేయబడ్డాయి:

i. కాంచీపురంలో డిజైన్ రిసోర్స్ సెంటర్ (డిఆర్‌సిలు) ప్రారంభోత్సవం
ii. డెవలప్‌మెంట్ కమిషనర్ (హ్యాండ్‌లూమ్స్) ద్వారా అభివృద్ధి చేయబడిన చేనేత గ్రామాల ప్రదర్శన:
  ఎ.కోవలం (తిరువనంతపురం జిల్లా, కేరళ)
 బి.మొహపర (గోలాఘాట్ జిల్లా, అస్సాం)
 సి.కనిహామా (బుడ్గాం జిల్లా, జమ్ము మరియు కశ్మీర్)

iii. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డిసి) ద్వారా అమ్మకం మరియు కొనుగోలు దారుల వర్చువల్ మీటింగ్
iv. రాయగఢ్‌ డిజైన్ రిసోర్స్ సెంటర్స్ (డిఆర్‌సి) లో వీవర్స్ సర్వీస్ సెంటర్ (డబ్ల్యుఎస్‌సి) భవన ప్రారంభోత్సవం అన్ని డబ్ల్యుఎస్‌సిలలో దశలవారీగా ఎన్‌ఐఎఫ్‌టి ద్వారా స్థాపించబడుతోంది. దీనిలో ఎగుమతిదారులు, తయారీదారులు, డిజైనర్లు ఉపయోగించడానికి డిజైన్‌లు మరియు వనరుల విస్తృత జాబితా అందుబాటులో ఉంటుంది.

ప్రధాన మంత్రి పిలుపు మేరకు జాతీయ స్థాయిలో 'మై హ్యాండ్‌లూమ్ మై ప్రైడ్ ఎక్స్‌పో' ఏర్పాటు చేయబడింది. 7 వ జాతీయ చేనేత వేడుకలను జరుపుకోవడానికి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డిసి) ఆగస్టు 1 నుండి 20 ఆగస్టు, 2021 వరకు న్యూఢిల్లీలోని డిల్లీహాట్, ఐఎన్‌ఎలో నిర్వహిస్తోంది. హ్యాండ్‌లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలు మరియు వీవర్స్ హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌లు/పాకెట్స్ నుండి హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. 22 రాష్ట్రాలకు చెందిన 125కి పైగా హ్యాండ్లూమ్ ఏజెన్సీలు/ జాతీయ అవార్డు గ్రహీతలు ఎక్స్‌పోలో పాల్గొంటున్నారు. ఎగ్జిబిషన్ ఆగష్టు 15, 2021 వరకు పదిహేను రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 10000 మందికి పైగా ప్రజలు ఎగ్జిబిషన్‌ని సందర్శిస్తారని అంచనా.

భారతదేశంలోని కొన్ని ప్రదేశాల నుండి సేకరించిన చేనేత ఉత్పత్తులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉన్నాయి. ఆ సంక్షిప్త జాబితా క్రింద ఇవ్వబడింది: -

· ఆంధ్రప్రదేశ్ -  కలంకారి చేనేత దుస్తులు మెటీరియల్స్

· బీహార్ -  భాగల్‌పురి తుసర్ పట్టు చీరలు & దుస్తుల సామగ్రి

· కర్ణాటక -  ఇల్కల్ పట్టు చీరలు, బెడ్‌షీట్, దుపట్టా

· మధ్యప్రదేశ్ - చందేరీ చీరలు, సూట్, దుపట్టా

· మణిపూర్ - మణిపూర్ సాంప్రదాయ హెండ్‌లూమ్‌ ఉత్పత్తులు

· మిజోరాం - మిజోరాం సాంప్రదాయ హెండ్‌లూమ్‌ ఉత్పత్తులు

· ఒడిశా -  సంబల్‌పురిఇక్కత్ చీరలు, డ్రెస్ మెటీరియల్

· పంజాబ్ - ఫుల్కారి

· రాజస్థాన్ - కాటన్ బెడ్‌షీట్, టవల్, యోగామాట్

· ఉత్తర ప్రదేశ్ - బనారసీ చీరలు, సూట్, డ్రెస్ మెటీరియల్

· వెస్ట్ బెంగల్ - జమదానీ చీరలు, డ్రెస్ మెటీరియల్, స్టోల్స్

· తమిళనాడు - సేలం చీరలు, డ్రెస్ మెటీరియల్

· తెలంగాణ - పోచంపల్లి ఇకత్ చీరలు, డ్రెస్ మెటీరియల్

 2021 ఆగస్టు 7 నుండి 11 వరకు #MyHandloomMyPride ఎక్స్‌పోను కూడా హోటల్ లీలా ప్యాలెస్ సమీపంలోని న్యూ మోతిబాగ్‌లోని కమ్యూనిటీ హాల్‌లో హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

అంతేకాకుండా అన్ని వీవర్స్ సర్వీస్ సెంటర్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్, ఎన్‌ఐఎఫ్‌టి క్యాంపస్‌లు, రాష్ట్ర ప్రభుత్వ చేనేత విభాగాలు మరియు హ్యాండ్‌లూమ్ క్లస్టర్లలో స్థానిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. హ్యాండ్‌లూమ్స్‌పై విద్యార్థులు మరియు సాధారణ ప్రజల కోసం  మైగవ్ పోర్టల్‌లో ఆగస్టు 7 నుండి 11 వరకు మరియు 2021 ఆగస్టు 19 నుండి 22 వరకు క్విజ్‌ నిర్వహిస్తోంది.


చేనేత ఉత్పత్తి చేసే ప్రధాన  రాష్ట్రాలు మరియు చేనేత నేత కార్మికుల సంఖ్య క్రింద ఇవ్వబడ్డాయి:

4 వ అఖిల భారత చేనేత జనాభా గణన (2019-20)

సంఖ్య     పారామీటర్లు        4 వ చేనేత జనాభా గణన

1              మగ్గాలు సంఖ్య       28.20 లక్షలు

2              గృహాల సంఖ్య        31.44 లక్షలు

3            చేనేత కార్మికుల మొత్తం సంఖ్య     35.22 లక్షలు

ఎ) చేనేత కార్మికుల మొత్తం సంఖ్య      26.74 లక్షలు

బి) అనుబంధ కార్మికుల మొత్తం సంఖ్య   8.48 లక్షలు

5 చేనేత కార్మికుడు సంవత్సరంలో సగటు  పని దినాల సంఖ్య   207

 

ప్రధాన చేనేత రాష్ట్రాలు

సంఖ్య     రాష్ట్రం      చేనేత కార్మికుల సంఖ్య

1    అస్సాం              12,83,881

2   పశ్చిమ బెంగాల్     6,31,447

3  తమిళనాడు            2,43,575

4 మణిపూర్              2,24,684

5 ఉత్తర ప్రదేశ్           1,90,957

6 ఆంధ్రప్రదేశ్           1,77,447

7 త్రిపుర                 1,37,639

8 ఒడిశా               1,17,836

9 అరుణాచల్ ప్రదేశ్    94,616

10 కర్ణాటక              54,791


 

*****



(Release ID: 1743669) Visitor Counter : 239