ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్-కిసాన్ తరువాతి కిస్తీ ని ఆగస్టు 9 న విడుదల చేయనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 AUG 2021 1:58PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా అందించే ఆర్థిక సహాయం తాలూకు తరువాతి కిస్తీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాబోయే సోమవారం నాడు అంటే 2021వ సంవత్సరం ఆగస్టు 9 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు.  దీని తో 9.75 కోట్ల కు పైచిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల సొమ్ము బదలాయింపున కు మార్గం సుగమం అవుతుంది.  ఈ కార్యక్రమం లో రైతు లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడనుండడమే కాకుండా దేశ ప్రజల ను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు.

 

 

పిఎమ్-కిసాన్ ను గురించి

 

పిఎమ్-కిసాన్ పథకం లో భాగం గా, అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాల కు ప్రతి సంవత్సరమూ 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని, ఒక్కొక్క సారీ 2,000 రూపాయల వంతు న, మూడు సమాన కిస్తీల లో- ప్రతి 4 నెలల కు ఒక కిస్తీ పద్ధతి లో- చెల్లించడం జరుగుతున్నది.  ఈ నిధి ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లో నేరు గా బదలాయిస్తూ వస్తారు.  ఈ పథకం లో, ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్ల రూపాయల సమ్మాన రాశి ని రైతు కుటుంబాల కు బదలాయించడమైంది.  

ఈ సందర్భం లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

 

***



(Release ID: 1743658) Visitor Counter : 194