యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో ఒలింపిక్స్ పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రెస్లర్ రవి కుమార్ దహియా భారతదేశానికే గర్వకారణం
Posted On:
05 AUG 2021 5:55PM by PIB Hyderabad
ముఖ్య అంశాలు:
· రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రవి కుమార్ దహియా చూపించిన ప్రతిభను ప్రశంసించారు.
· రవి కుమార్ దహియాను క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందిస్తూ ఆయన చూపిన అత్యుత్తమ ప్రదర్శన ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణంగా ఉంటుందని అన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీ స్టయిల్ 57 కేజీల విభాగం ఫైనల్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన రష్యాకు చెందిన జౌర్ ఉగ్యూవ్‌తో 4-7 తేడాతో ఓడిపోయి రజత పతకం సాధించాడు. 23 ఏళ్ల సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ తరువాత దేశానికి రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా నిలిచాడు. టోక్యోలో మీరాబాయ్ చాను, పీవీ సింధు, లవ్లినా, మరియు పురుషుల హాకీ జట్టు సాధించిన పతకాల తర్వాత ఇది భారతదేశానికి ఐదవ పతకం. రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు దేశవ్యాప్తంగా ప్రజలు రజత పతక విజేత రవి కుమార్ దహియా కి అభినందనలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాను రాష్ట్రపతిశ్రీ రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. శ్రీ కోవింద్ ట్వీట్ చేస్తూ “టోక్యో 2020 లో రెజ్లింగ్ రజతం గెలిచిన రవి దహియా చూసి భారతదేశం గర్వపడుతోంది. మీరు చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి తిరిగి పోటీలోకి వచ్చి గెలిచారు. నిజమైన ఛాంపియన్ తరహాలో మీరు మీ అంతర్గత శక్తిని కూడా ప్రదర్శించారు. ఆదర్శవంతమైన విజయాలు సాధించిన భారతదేశానికి కీర్తి తెచ్చినందుకు అభినందనలు. ” అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెజ్లర్ రవికుమార్‌ని అభినందిస్తూ "రవి కుమార్ దహియా ఒక అద్భుతమైన మల్లయోధుడు! అతని పోరాట పటిమ మరియు పట్టుదల అత్యద్భుతం. టోక్యో 2020 లో రజత పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. అతని విజయాలతో భారతదేశం గర్వపడుతుంది."అని వ్యాఖ్యానించారు.
క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మల్లయోధుడు రవి కుమార్ దహియాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “ఇండియా గెలిచింది! భారత దేశం గెలిచేలా మీరు చూసారు. రవీ! అభినందనలు! మీ ఉత్సాహభరితమైన ప్రదర్శన ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం! ఎంత అద్భుతమైన ప్రయాణం! భారతీయ క్రీడలకు ఎంత అద్భుతమైన రోజు!" అని ఆయన తన ట్వీట్ లో అన్నారు.
రవి కుమార్ దహియా హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని నహ్రీ గ్రామానికి చెందినవాడు. అతను వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. అతని తండ్రి తన గ్రామంలో వరి పొలాల్లో పని చేసేవాడు. అతను 10 సంవత్సరాల వయస్సులో రెజ్లింగ్ ప్రారంభించాడు. 2017 లో సీనియర్ నేషనల్ సమయంలో అతని మోకాలికి గాయం తగిలింది. దీనితో స్పాన్సర్‌లు లేకపోవడంతో గాయం నుంచి కోలుకోవడానికి తన శ్రేయోభిలాషులపై ఆధారపడవలసి వచ్చింది.
వ్యక్తిగత వివరాలు:
పుట్టిన తేదీ: డిసెంబర్ 12, 1997
ఇంటి స్థానం: నిహారి, సోనిపట్, హర్యానా
క్రీడ: కుస్తీ
శిక్షణా స్థావరం: సాయ్ సోనిపట్/ ఛత్రసాల్ స్టేడియం
వ్యక్తిగత కోచ్: కమల్ మాలికోవ్
జాతీయ కోచ్: జగ్మందిర్ సింగ్
విజయాలు:
· ప్రపంచ ఛాంపియన్‌షిప్ - కాంస్య
· ఆసియా ఛాంపియన్‌షిప్ - 2 స్వర్ణం
· అండర్ -23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ - 1 రజత పతకం
· ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ - రజతం
· ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ - స్వర్ణం
కీలక ప్రభుత్వం సహకారం
· జాతీయ శిబిరాలలో వ్యక్తిగత సహాయక సిబ్బందిని చేర్చడం
· ఆసియన్ ఛాంపియన్షిప్స్, సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, మాటియో పెల్లికోన్ ర్యాంకింగ్ టోర్నమెంట్, యాసర్ డోగు మరియు వరల్డ్ కప్ 2018 మరియు 2021 లలో పాల్గొనడం
· ఒలింపిక్స్ 2020 కోసం వ్యక్తిగత సహాయక సిబ్బందితో పాటు రష్యాలో శిక్షణా శిబిరం
* పోలాండ్ ఓపెన్ 2020 లో పాల్గొనడానికి వీసా సమకూర్చడం
నిధులు
టాప్స్
|
ఏసీటీసీ
|
మొత్తం
|
రూ. 15,17,188
|
రూ. 47,47,249
|
రూ. 62,91,437
|
కోచ్‌ల వివరాలు:
కింది స్థాయి: హంసరాజ్
అభివృద్ధి స్థాయి: లలిత్/ మహాబలి సత్పాల్
ఎలైట్ స్థాయి: మహాబలి సత్పాల్/ జగ్మందిర్ సింగ్/ కమల్ మాలికోవ్
***
(Release ID: 1743210)
Visitor Counter : 199