యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

గత మూడు సంవత్సరాలలో 189 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరుః వైఏఎస్ మంత్రిత్వ శాఖ‌


- 360 ఖేలో ఇండియా కేంద్రాలు, 24 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు 160 ఖేలో ఇండియా అకాడమీల మంజూరు: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 05 AUG 2021 2:39PM by PIB Hyderabad

కీల‌క ముఖ్యాంశాలు:

దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర వైఏఎస్‌ మంత్రిత్వ శాఖ ప‌లు ర‌కాల‌ పథకాలను రూపొందించింది; ఖేలో ఇండియా స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఫండ్ వంటివి ఇందులో కొన్ని. 'క్రీడలు' రాష్ట్ర ప‌రిధిలోని అంశం. క్రీడలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం విధానాల‌ను రూపొందించడంతో పాటు, క్రీడల అభివృద్ధి బాధ్యత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలపై ఉంటుంది. వీరి ప్రయత్నాలకు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం త‌గిన తోడ్పాటు అందిస్తుంది.
గ్రామీణ ప్రాంతాలతో సహా దేశంలో వివిధ‌ క్రీడలను ప్రోత్సహించడానికి మరియు క్రీడాకారులను ప్రోత్సహించడానికి యువజన వ్యవహారాలు మ‌రియు క్రీడ‌ల‌ మంత్రిత్వ శాఖ (వైఏఎస్‌) కింది ఉద‌హ‌రించిన పథకాలను రూపొందించింది:-

(i) ఖేలో ఇండియా పథకం

(ii) జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం

(iii) అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో విజేతలకు మరియు వారి కోచ్‌లకు ప్రత్యేక అవార్డులు

(iv) జాతీయ క్రీడా అవార్డులు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్

(v) పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ క్రీడా సంక్షేమ నిధి

(vi) జాతీయ క్రీడా అభివృద్ధి నిధి

(vii) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా క్రీడా శిక్షణా కేంద్రాలను అమలు చేయడం
పైన పేర్కొన్న పథకాల వివరాలు మంత్రిత్వ శాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్లలోని పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల నుండి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు స్వీకరిస్తూనే ఉంటుంది. ప్రతిపాదనల పరిపూర్ణత, సాంకేతిక సాధ్యాసాధ్యాలు మరియు పథకాల కింద నిధుల లభ్యతకు లోబడి, సంబంధిత పథకాల పారామితుల ప్రకారం ఆయా ప్రతిపాదనలు మంజూరు చేయబడతాయి. గడిచిన‌ మూడు సంవత్సరాలలో, ఈ మంత్రిత్వ శాఖ 189 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, 360 ఖేలో ఇండియా కేంద్రాలు, 24 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు, 160 ఖేలో ఇండియా అకాడమీలను ప్రోత్సహించడానికి మరియు మహారాష్ట్రతో సహా దేశంలో క్రీడల అభివృద్ధికి మంజూరు చేసింది. ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు లోక్సభకు తెలిపిన ఒక‌ లిఖితపూర్వక స‌మాధానంలో తెలిపారు.
                                                                                       
 

*****(Release ID: 1742957) Visitor Counter : 145