ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బెంగాల్ లో వరద బాధితుల కోసం పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఎక్స్-గ్రేషియా ను ఆమోదించిన - ప్రధానమంత్రి

Posted On: 04 AUG 2021 8:22PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల మేర ఎక్స్ గ్రేషియా అందజేయడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తమ ఆమోదం తెలియజేశారు.  గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ , "పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు పి.ఎం.ఎన్..ఆర్.ఎఫ్. నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదించారు.  గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇస్తారు." అని పేర్కొంది.

*****

DS/SH


(Release ID: 1742522) Visitor Counter : 160