ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళ లహాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నేర్పు ను కనబరచింది: ప్రధాన మంత్రి
Posted On:
04 AUG 2021 5:51PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ 2020 లో నేడు ఆడిన ఆట లోను, ఇంతవరకు జరిగిన పోటీల లోను మన మహిళ ల హాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నైపుణ్యాన్ని కనబరచిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జట్టు ను చూసి తాను గర్విస్తున్నానని రాబోయే ఆట లోను, భావి ప్రయాసల లో వారికి మంచి అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను అని కూడా ఆయన అన్నారు.
‘‘ #Tokyo2020 లో మనం జ్ఞాపకం పెట్టుకొనే ఒక విషయం ఏమిటి అంటే అది మన హాకీ జట్ల బ్రహ్మాండమైన ప్రదర్శన.
ఈ రోజు న, మరి అలాగే ఇంతవరకు జరిగిన ఆటల లో మన మహిళ ల హాకీ జట్టు చొరవ తీసుకొని ఆడి గొప్ప ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. జట్టు ను చూస్తే గర్వం గా ఉంది. ఇప్పుడు ఆడే ఆట తో పాటు ఇకముందు ఆడే ఆటల లోనూ అదృష్టం వరించు గాక ’’ అని ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1742460)
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam