ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్లో భారీ వర్షపాతం, కొన్ని ప్రాంతాల లో వరద తరహా స్థితివల్ల బాధితులైన వారికి సాయపడటం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం తో కేంద్ర ప్రభుత్వంసన్నిహితం గా కృషి చేస్తోంది: ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 AUG 2021 1:23PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం తో పాటు జల మయం అయిన ప్రాంతాల లో బాధితుల కు సాయపడడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం తో కేంద్ర ప్రభుత్వం కలసికట్టు గా పనిచేస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ తోనూ ప్రధాన మంత్రి మాట్లాడి, స్థితి ని సమీక్షించారు.
‘‘ మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం, వరదల కారణం గా బాధితులు అయిన వారికి సాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం తో కలసి కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి @ChouhanShivraj తో నేను మాట్లాడి, స్థితి ని సమీక్షించాను. ప్రతి ఒక్కరి సురక్ష కోసం, ప్రతి ఒక్కరి క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1742356)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam