సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఈ ఏడాది స్వాతంత్య్ర‌దినోత్స‌వం నాడు ఆజాది కా అమృతో మ‌హోత్స‌వ్ ను జ‌రుపుకునేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన కేంద్ర‌ సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ‌ జాతీయ గీతాన్ని పాడండి, రికార్డు చేయండి .దానిని రాష్ట్ర‌గాన్‌.ఇన్ ('RASHTRAGAAN.IN)లో అప్‌లోడ్ చేయండి.

Posted On: 02 AUG 2021 3:55PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
--WWW.RASHTRAGAAN.IN పైక్లిక్ చేయండి,మీ వీడియోని అప్ లోడ్ చేయండి, ఎకెఎఎంలో భాగ‌స్వాములు కండి.
జాతీయ గీతం సంకలనం 15 ఆగస్టు 2021 న ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
- భార‌త‌దేశ 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర‌దినోత్స‌వాల‌ను స్మ‌రించుకుంటూ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ .

----
- భార‌త‌దేశ 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర‌దినోత్స‌వాల‌ను స్మ‌రించుకుంటూ  దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ . ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేసేందుకు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జాతీయ గీతంతో ముడిప‌డిన‌ది. దీనిని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ చేప‌ట్టింది. దేశ‌వ్యాప్తంగా భార‌తీయుల‌లో ఐక్య‌త‌ను తెలియ‌జెప్పేందుకు, ప్ర‌జ‌లు గ‌ర్వించేలా దీనిని నిర్వ‌హిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌జ‌లు జాతీయ గీతాన్ని పాడి ఆ వీడియోను www.RASHTRAGAAN.IN వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ జాతీయ‌గీతాల  సంక‌ల‌నాన్న 2021 ఆగ‌స్టు 15న ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ గ‌త నెల 25 వ తేదీన మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. “గ‌రిష్ఠ సంఖ్య‌లో భార‌తీయులు జాతీయ గీతాన్ని సమ‌ష్ఠిగా క‌లిసి పాడేలా చేసే కృషిలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందుకు ఒక వెబ్‌సైట్ Rashtragan.in. ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు జాతీయ గీతాన్ని పాడి , రికార్డు చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయ‌డం ద్వారా ఈ ప్ర‌చారంతో అనుసంధానం కావ‌చ్చు. మీరు ఈ వినూత్న కార్య‌క్ర‌మంలో మీరు భాగ‌స్వాములు అవుతార‌ని ఆశిస్తున్నాను.”

75 వసంవ‌త్స‌రాల స్వాతంత్య్ర‌దినోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని  జాతీయ గీతాన్ని పాడి రికార్డు చేయాల్సిందిగా పిలుపునిస్తూ, కేంద్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క‌, ఈశాన్య ప్రాంత‌ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిష‌న్‌రెడ్డి తాను  జాతీయ‌గీతాన్ని పాడి రికార్డు చేశారు. 

“75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర‌దినోత్స‌వాలను పుర‌స్క‌రించుకున , మ‌నం జాతీయ‌గీతాన్ని పాడేందుకు క‌ల‌సిక‌ట్టుగా ముందుకు వ‌ద్దాం. నేను జాతీయ గీతాన్ని పాడి, రికార్డు చేసి అప్‌లోడ్ చేశాను. మ‌రి మీరు?
పౌరులంద‌రూ జాతీయ‌గీతాన్ని పాడి ఆ వీడియోను http://rashtragaan.in #AmritMahotsav” పై అప్‌లోడ్  చేయాల్సిందిగా కోరుతున్నాను”  అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల భార‌తీయులు ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోగ‌ల‌ర‌న్నారు. అలాగే యువ‌త పెద్ద సంఖ్య‌లో ఇందులో పాల్గొనాల‌న్నారు. అప్‌లోడ్ చేసిన జాతీయ‌గీతం వీడియోల సంక‌ల‌నాన్ని 2021 ఆగ‌పంటె 15న ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతుంది.

అలాగే , ఈరోజు స్వాతంత్య్ర‌స‌మ‌ర యోధుడు పింగ‌ళి వెంక‌య్య 125 వ జ‌యంతి సంద‌ర్భంగా మంత్రి ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.
“ విద్యావేత్త‌, ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు,భార‌త‌ జాతీయ ప‌తాక రూప‌శిల్పి పింగ‌ళి వెంక‌య్య‌గారికి నా నివాళులు.ఈ ప‌తాకం కోట్లాది మంది భార‌తీయుల గుండెల్లో దేశ‌భ‌క్తిని, గ‌ర్వాన్ని నింపుతుంది, శ్రీ పింగ‌ళి వెంక‌య్య‌గారికి వారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు” అని శ్రీ కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీ‌పింగ‌ళి వెంకయ్య‌గారు 1916లో, భార‌త‌దేశానికి జాతీయ ప‌తాకం పేరుతో ఒక పుస్త‌కాన్ని ప్ర‌చురించారు.ఇందులో వివిధ దేశాల పతాకాల గురించి వివ‌రించి, భార‌త జాతీయ ప‌తాకం గురించిన త‌న ఆలోచ‌న‌ల‌ను వారు అందులో తెలియజేశారు.

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ ద్వారా మ‌న 75 వ స్వాతంత్య్ర దినోత్స‌వం ఒక ప్ర‌జా ఉద్య‌మం కావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆకాంక్ష‌ఙంచారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, క్షేత్ర‌స్థాయిలోని వివిధ క‌మిటీల‌తో క‌ల‌సి ఈ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది.

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్  కార్య‌క్ర‌మం ఈ ఏడాది మార్చి 12న మ‌హాత్మాగాంధీ గారి స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం నుంచి ప్రారంభ‌మైంది. 2022 ఆగ‌స్టు 15 నాటికి 75 వ స్వాతంత్య్ర‌దినోత్స‌వ వార్షికోత్స‌వాల‌కు ముంద‌స్తుగా 75 వారాల కార్య‌క్ర‌మం ప్రారంభించడం జరిగింది. అప్ప‌టి నుంచి జ‌మ్ము కాశ్మీర్ నుంచి పుదుచ్చేరి వ‌ర‌కు ,గుజ‌రాత్‌నుంచి ఈశాన్య ప్రాంతం వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా అమృత్ మ‌హోత్స‌వ్ కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

***



(Release ID: 1741693) Visitor Counter : 622