ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ కు చెందిన గుజరాత్ లబ్ధిదారుల తో ఆగస్టు 3 న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
Posted On:
01 AUG 2021 9:11PM by PIB Hyderabad
గుజరాత్ లోని ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం ఆగస్టు 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.
ఈ పథకం గురించి ఆ రాష్ట్రం లో అవగాహన ను పెంచేందుకు ప్రజా భాగస్వామ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతోంది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన (పిఎంజికెఎవై) ని గురించి:
పిఎంజికెఎవై అనేది ఒక ఆహార భద్రత సంక్షేమ సంబంధి కార్యక్రమం. కోవిడ్ -19 తాలూకు ఆర్ధిక ప్రభావాన్ని తగ్గించడం లో సాయపడుతూ, తోడ్పాటు ను అందించేందుకు ప్రధాన మంత్రి ఆలోచనల లో నుంచి రూపుదిద్దుకొన్న కార్యక్రమం ఇది. పిఎంజికెఎవై లో భాగం గా, జాతీయ ఆహార భద్రత చట్టం పరిధి లో లబ్ధిదారుల కు అందరికీ ప్రతి ఒక్కరికీ 5 కిలో ల అదనపు ఆహార ధాన్యాల ను ఇవ్వడం జరుగుతుంది.
ఈ సందర్భం లో గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.
***
(Release ID: 1741399)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam