హోం మంత్రిత్వ శాఖ

వైద్య‌విద్యా సీట్ల‌లో ఒబిసిలు, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న శ్రీ మోదీ ప్రభుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


ఈ చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్న శ్రీ న‌రేంద్ర మోదీకి నా అభినంద‌న‌లు

దీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న ఈ డిమాండును తీర్చ‌డం ద్వారా వెనుక‌బ‌డిన‌, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ప‌ట్ల ప్ర‌భుత్వ క‌ట్టుబాటును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

శ్రీ మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో 5550 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2021 7:08PM by PIB Hyderabad

వైద్య‌విద్యా సీట్ల‌లో ఒబిసి వ‌ర్గీక‌ర‌ణ‌లోని వారు, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న శ్రీ మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా స్వాగ‌తించారు. “వైద్య‌విద్యా విభాగంలో అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి మెడిక‌ల్‌/  డెంట‌ల్ కోర్సులు) సీట్ల‌లో ఒబిసిల‌కు 27 శాతం, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నందుకు శ్రీ న‌రేంద్ర మోదీకి నా అభినంద‌న‌లు” అని శ్రీ అమిత్ షా ట్వీట్ చేశారు.

“దీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న ఈ డిమాండును తీర్చ‌డం ద్వారా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ప‌ట్ల ప్ర‌భుత్వ క‌ట్టుబాటును ప్ర‌ద‌ర్శించారు. శ్రీ మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో సుమారు 5550 విద్యార్థులు లాభం పొందుతారు” అని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.

ఈ స్కీమ్ కింద 2021-22 విద్యాసంవ‌త్స‌రం నుంచి అన్ని అండ‌ర్ గ్రాడ్యుయేట్‌/  పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్‌/  డెంట‌ల్ కోర్సుల్లోను అఖిల భార‌త కోటాకు కూడా ఒబిసిల‌కు 27 శాతం, ఇడ‌బ్ల్యుఎస్ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తాయి.

***


(రిలీజ్ ఐడి: 1740574) సందర్శకుల సూచీ సంఖ్య : : 247
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil