ప్రధాన మంత్రి కార్యాలయం
ధోలావీర ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల లో ఒకటి గా యునెస్కో ప్రకటించినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
27 JUL 2021 5:37PM by PIB Hyderabad
భారతదేశం లో హరప్పా యుగానికి చెందిన ధోలావీరా ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల లో ఒకటి గా యునెస్కో ప్రకటించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. అది తప్పక సందర్శించ దగిన ప్రదేశాల లో ఒకటి అని, ప్రత్యేకించి చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రాల పట్ల ఆసక్తి ని కలిగి ఉన్న వారు ధోలావీరా ను సందర్శించి తీరాల్సిందే అని కూడా ఆయన అన్నారు.
యునెస్కో ద్వారా నమోదు అయిన ఒక ట్వీట్ లో ని సమాచారం పట్ల ప్రధాన మంత్రి తన ప్రతిస్పందన ను వ్యక్తం చేస్తూ, అనేక ట్వీట్ ల లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘ ఈ వార్త తెలిసి నిజం గా ఎంతో సంతోషం కలిగింది.
ధోలావీరా ఒక ముఖ్యమైన పట్టణ కేంద్రంగా కూడా ఉండింది. మన గతకాలం లో మనకు ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన బంధాల లో ధోలావీరా ఒకటి. అక్కడ కు తప్పక వెళ్లవలసిందే. ప్రత్యేకించి చరిత్ర, సంస్కృతి పురాతత్వ శాస్త్రాల లో అభిరుచి ఉన్న వారు అక్కడకు వెళ్లి తీరాలి.
నేను నా విద్యార్థి జీవనం లో ధోలావీరా ను మొట్టమొదటి సారి గా సందర్శించాను. మరి ఆ ప్రదేశాన్ని చూసి మంత్రముగ్ధుడి ని అయ్యాను.
గుజరాత్ కు ముఖ్యమంత్రి హోదా లో ధోలావీరా లో వారసత్వ పరిరక్షణ కు, పునరుద్ధరణ కు సంబంధించిన అంశాల పై కృషి చేసే అవకాశం నాకు లభించింది. అక్కడ పర్యటన సంబంధి స్నేహ పూర్వక మౌలిక సదుపాయాల కల్పన కోసం మా జట్టు పాటుపడింది. ’’
***
DS/SH
(Release ID: 1739788)
Visitor Counter : 151
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam