ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఘనంగా 161వ ఆదాయం పన్ను దినోత్సవం: దేశాభివృద్ధిలో సహకారం

Posted On: 24 JUL 2021 12:21PM by PIB Hyderabad

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాపితంగా ఆదాయం పన్ను 161వ దినోత్సవం ఘనంగా జరిగింది. సిబిడిటి కేంద్ర కార్యాలయంతో పాటు క్షేత్ర కార్యాలయాల్లో ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆదాయం పన్నుశాఖ పని తీరు, సమర్ధత, సహకారం, జాతి నిర్మాణంలో ఆదాయం పన్ను శాఖ పోషిస్తున్న పాత్ర లాంటి అంశాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా సిబిడిటి మొక్కలను నాటడం, టీకాలను వేయడం, కోవిడ్-19 సమయంలో సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొన్న శాఖ అధికారులను సన్మానించడం, కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను ఆదరించడం, ఆదాయం పన్నుతో సంబంధం ఉన్న  వర్గాలతో వెబినార్లను నిర్వహించింది. 

ఆదాయం పన్నుశాఖ అధికారులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ దేశ పురోభివృద్ధికి సహకరిస్తున్నారని కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదాయం పన్ను దినోత్సవం సందర్భంగా పంపిన సందేశంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదాయం పన్నుశాఖకు అభినందనలను తెలిపారు. 2014 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ఆదాయం పన్ను శాఖ సమర్ధంగా అమలు చేస్తున్నదని అన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నవారిని గుర్తించి గౌరవించవలసి ఉందని ఆమె అన్నారు. పని విధానాలను సులభతరం చేసి ఎటువంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా లేకుండా ఆదాయం పన్ను శాఖ పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. కోవిడ్ రూపంలో సమస్యలు ఎదురైనప్పటికి పన్ను చెల్లించినవారిని మంత్రి అభినందించారు. కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులు అర్పించిన మంత్రి దేశాభివృద్ధిలో వారి సేవలు చెక్కు చెదరకుండా ఉంటాయని అన్నారు. 

రెవెన్యూ ఆదాయ సముపార్జనతో పాటు పన్ను విధానాలను ఆదాయం పన్ను శాఖ సమర్ధంగా పారదర్శకంగా అమలు చేస్తున్నదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి తన సందేశంలో పేర్కొన్నారు. ఆదాయంపన్ను శాఖకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆన్ లైన్ లో జరుగుతున్నాయని, కోసం ప్రజలు ఎక్కువగా కార్యాలయాలకు వ్యక్తిగతంగా రాకుండా చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు, పన్ను చెల్లింపుదారులు భయం లేకుండా ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచి సమావేశం అవుతున్నారని అన్నారు. 

ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను అమలు చేస్తున్న ఆదాయం పన్ను శాఖ దేశానికి సేవ చేస్తున్నదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావ్  కరాద్ తన సందేశంలో పేర్కొన్నారు. పన్నులు అనేవి ప్రభుత్వానికి ఆదాయ వనరులు కావని అన్న మంత్రి దీనిద్వారా సామాజిక ఆర్ధిక లక్ష్యాలను సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. కాలానుగుణంగా తన విధానాలను మార్చుకుంటూ పనిచేస్తున్న శాఖ సవాళ్ళను ఎదుర్కొంటూ పనిచేస్తున్నదని అన్నారు. జవాబుదారీతనంతో పారదర్శకంగా స్వేచ్ఛగా పనిచేస్తూ ఆదాయం పన్ను శాఖ వృత్తిపరమైన సంస్థగా గుర్తింపు పొందిందని అన్నారు. 

ఆదాయం పన్ను శాఖకు  రెవెన్యూ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్ తన సందేశంలో శాఖకు తన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ధిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖ పనిచేస్తూ పన్ను వసూళ్లను గణనీయంగా పెంచిందని అన్నారు. పన్ను చెల్లింపుదారుల  అవసరాలకు అనుగుణంగా వారిపై విశ్వాసం ఉంచి శాఖ పనిచేస్తున్నదని అన్నారు. కోవిడ్-19 సమయంలో సహాయ కార్యక్రమాలను నిర్వహించిసిబ్బంది వారి కుటుంబాలకు టీకాలు వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులను ఆయన  అభినందించారు. 

  సిబిడిటి  ఛైర్మన్ శ్రీ జె. బి. మోహపాత్రా ఆదాయం పన్ను శాఖ సిబ్బందివారి కుటుంబాలకు తన శుభాకాంక్షలు తెలిపారు.  ఆదాయ సంపాదన విభాగంగా మరియు పన్ను చెల్లింపుదారుల సేవలను అందించే శాఖగా ఆదాయం పన్ను శాఖ పనిచేస్తున్నదని అన్నారు. నిజాయితీని గౌరవించడంపన్ను చెల్లింపుదారుల హక్కులను గౌరవించడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆదాయం పన్ను శాఖ సమర్ధంగా పారదర్శకంగా పనిచేస్తున్నదని అన్నారు. కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు మరియు అధికారుల కుటుంబాలకు ఆయన సంతాపాన్నితెలియజేసారు.వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత అంకితభావంతో శాఖ విధులను నిర్వహిస్తుందని అన్నారు.  

 

***


(Release ID: 1738670) Visitor Counter : 206