ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో కొండచరియలు కూలి ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్టపరిహారం ప్రకటన

प्रविष्टि तिथि: 23 JUL 2021 6:43PM by PIB Hyderabad

   మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో కొండచరియలు కూలి ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సందేశమిస్తూ- "మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో కొండచరియలు కూలి ప్రాణనష్టం వాటిల్లడం నన్నెంతో కలచివేసింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం

 

ప్రభావిత ప్రజానీకానికి అవసరమైన అన్నిరకాల సహాయం అందిస్తాం" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, గాయపడినవారికి రూ.50,000 వంతున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ట్విట్టర్‌ద్వారా- "మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో కొండచరియలు కూలి ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షల వంతున పరిహారంతోపాటు గాయపడినవారికి రూ.50,000 అందిస్తామని పీఎం @నరేంద్ర మోదీ ప్రకటించారు."

 

***

DS/SH 

***


(रिलीज़ आईडी: 1738376) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam