ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఐక్య రాజ్య సమితి గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్‌లో భారతదేశ స్కోరు గణనీయమైన మెరుగుదల

Posted On: 23 JUL 2021 8:49AM by PIB Hyderabad

యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్ ఫర్ ఆసియా పసిఫిక్ (యునెస్కాప్) డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్‌లో నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో  భారత్ 90.32% స్కోర్ సాధించింది. 2019 లో ఇది 78.49% నుండి గొప్ప పెరుగుదల అని సర్వే ప్రశంసించింది.

సర్వే ఫలితాన్ని(https://www.untfsurvey.org/economy?id=IND)వద్ద పొందవచ్చు

143 ఆర్థిక వ్యవస్థల మూల్యాంకనం తరువాత, 2021 సర్వే మొత్తం 5 ముఖ్య సూచికలలో భారతదేశం యొక్క గణనీయమైన మెరుగుదలను ప్రముఖంగా ప్రస్తావించింది:

 

పారదర్శకత: 2021 లో 100% (2019 లో 93.33% నుండి) 

ఫార్మాలిటీలు: 2021 లో 95.83% (2019 లో 87.5% నుండి) 

సంస్థాగత ఏర్పాట్లు మరియు సహకారం: 2021 లో 88.89% (2019 లో 66.67% నుండి) 

కాగిత రహిత వాణిజ్యం: 2021 లో 96.3% (2019 లో 81.48% నుండి) 

సరిహద్దుల ఆవల కాగిత రహిత వాణిజ్యం: 2021 లో 66.67% (2019 లో 55.56% నుండి)

 

దక్షిణ మరియు నైరుతి ఆసియా ప్రాంతం (63.12%), ఆసియా పసిఫిక్ ప్రాంతంతో (65.85%) పోలిస్తే భారతదేశం ఉత్తమ పనితీరు కనబరిచిన దేశమని సర్వే పేర్కొంది.

భారతదేశం మొత్తం స్కోరు ఫ్రాన్స్, యుకె, కెనడా, నార్వే, ఫిన్లాండ్ మొదలైన అనేక ఓఇసిడి దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. మొత్తం స్కోరు ఈయూ సగటు స్కోరు కంటే ఎక్కువగా ఉంది. భారతదేశం పారదర్శకత సూచికకు 100 శాతం, "విమెన్ ఇన్ ట్రేడ్" విభాగంలో 66 శాతం స్కోరును సాధించింది.

 

 

వరుస సంస్కరణల ద్వారా ఫేస్లెస్, పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ కస్టమ్స్‌ను ప్రారంభించడానికి 'తురంత్' కస్టమ్స్ గొడుగు కింద వినూత్న సంస్కరణల్లో సిబిఐసి ముందంజలో ఉంది. డిజిటల్, స్థిరమైన వాణిజ్య సదుపాయాల మెరుగుదల పరంగా  యునెస్కాప్ ర్యాంకింగ్స్ పై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.

ఇంకా, కోవిడ్ 19 మహమ్మారి సమయంలో, ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, ప్రాణరక్షక ఔషధాలు, టీకాలు వంటి కోవిడ్ సంబంధిత దిగుమతులను వేగవంతం చేయడానికి కస్టమ్స్ సంస్థలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఎక్సిమ్ వాణిజ్యం కోసం దిగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్య(ల) ను త్వరగా పరిష్కరించడానికి సిబిఐసి వెబ్‌సైట్ ప్రత్యేకించిన సింగిల్ విండో కోవిడ్-19 24 * 7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటైంది.

సర్వే గురించి:

గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు యునెస్కాప్ నిర్వహిస్తుంది. 2021 సర్వేలో డబ్ల్యూటిఓ వాణిజ్య సౌకర్య ఒప్పందం ద్వారా కవర్ చేయబడిన 58 వాణిజ్య సులభతర చర్యల అంచనా వేస్తారు. వాణిజ్య సదుపాయాల చర్యలు ఆశించిన ప్రభావాన్ని కలిగి ఉన్నాయో లేదో రుజువు చేస్తున్నందున సర్వే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశాల మధ్య పోలికను విభజించడానికి సహాయపడుతుంది. దేశానికి అధిక స్కోరు వారి పెట్టుబడి నిర్ణయాలలో వ్యాపారాలకు సహాయపడుతుంది.



(Release ID: 1738261) Visitor Counter : 245