ప్రధాన మంత్రి కార్యాలయం
2021 వ సంవత్సర పార్లమెంట్ వర్షకాల సమావేశాల ఆరంభం సందర్భం లో ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు
ఇంతవరకు 40 కోట్ల మంది భారతీయులు వారి బాహువుల కు టీకా మందు ను వేయించుకోవడం ద్వారా ‘బాహుబలి’ లా మారారు: ప్రధాన మంత్రి
మహమ్మారి అంశం పై పార్లమెంట్ లో అర్థవంతమైన సకారాత్మక వాదోపవాదాలు జరగాలి అని మేం కోరుకుంటున్నాం: ప్రధాన మంత్రి
మహమ్మారి పై చర్చ కోసం రేపటి సాయంత్రం కొంత సమయాన్ని ఇవ్వండని సభా నాయకుల ను నేను అడిగాను: ప్రధాన మంత్రి
ప్రతిపక్షాలు కఠినమైన, చురుకైన ప్రశ్నల ను అడగాలి; అయితే శాంతియుత వాతావరణం లో సమాధానాన్ని ఇచ్చేందుకు కూడా అవకాశాన్ని ఇవ్వాలి: ప్రధాన మంత్రి
Posted On:
19 JUL 2021 11:13AM by PIB Hyderabad
మిత్రులారా స్వాగతం, మరి మీరు అందరూ టీకా ను కనీసం ఒకసారి అయినా వేయించుకొని ఉండి ఉంటారు అని నేను ఆశపడుతున్నాను. అలా టీకా ను వేయించుకొని ఉన్నప్పటి కీ కూడాను కరోనా ను దృష్టి లో పెట్టుకొని రూపొందించిన నియమాల ను పాటించడం లో సహకరించండంటూ మీ అందరినీ, సభ లోని నా సహచరుల ను నేను ప్రార్థిస్తున్నాను. టీకామందు ను ‘బాహువుల’ కు ఇవ్వడం జరిగింది; అలా టీకా ను ఇప్పించుకొన్న వారు ‘బాహుబలి’ అయ్యారు. కరోనా కు వ్యతిరేకం గా పోరాడటానికి బాహుబలి గా మారేందుకు టీకా ఇప్పించుకోవడం ఒక్కటే మార్గం.
కరోనా కు వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో 40 కోట్ల కు పైగా వ్యక్తులు ‘బాహుబాలి’ వలె మారారు. ఈ కార్యక్రమాన్ని శరవేగం గా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. యావత్తు ప్రపంచాన్ని, మొత్తం మానవ జాతి ని మహమ్మారి తన గుప్పిట్లోకి తీసుకొంది. ఈ కారణం గా పార్లమెంటు లో ఈ అంశం పై సార్ధకమైనటువంటి చర్చ జరగాలి అని మనం కోరుకుంటున్నాం. దీనికి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిందే. అలా చేసినప్పుడు, గౌరవనీయ ఎంపి లు అందరి వద్ద నుంచి ఆచరణీయమైన సూచనల ను మనం అందుకోగలుగుతాం. దాని వల్ల మహమ్మారి కి వ్యతిరేకం గా జరుపుతున్న పోరాటం లో అనేక కొత్త కొత్త ఆలోచన లు ముందుకు వస్తాయి. లోటుపాటు లు ఏమైనా ఉన్నప్పటి కీ వాటి ని సరిదిద్దుకోవడం సాధ్యపడుతుంది. మరి ఈ పోరు లో మనం కలసి ముందంజ వేయవచ్చును.
రేపటి సాయంత్రం వేళ లో కొంత కాలాన్ని వెచ్చించవలసింది గా సభా నాయకులు అందరినీ నేను అభ్యర్థించాను. ఇలా ఎందుకు అంటే మహమ్మారి స్థితి పై వారికి నేను ఒక సమగ్రమైన సమర్పణ ను ఇవ్వదలచుకొన్నాను. సభ లోపల, సభ వెలుపల సైతం సభా నాయకులు అందరితో చర్చించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రుల తో నేను నిరంతర ప్రాతిపదిక న భేటీ అవుతూ వచ్చాను. వేరు వేరు వేదికల లో వాదన లు చోటు చేసుకొంటున్నాయి. సభ లో చర్చ తో పాటు, సభా నాయకుల తో ఒక చర్చ అంటూ జరగడం సౌకర్యవంతం గా ఉంటుంది. ఈ సమావేశాలు ప్రభావశీల చర్చోపచర్చల తో, ఫలితాలను పొందడం ప్రధానం గా ఉండేటట్టు జరగనివ్వండి.
అలాగైతే ప్రభుత్వం ప్రజల కు వారు ఆశించిన సమాధానాల ను ఇవ్వగలుగుతుంది. ఉభయ సభల లో అత్యంత కఠినమైనటువంటి, పదునైనటువంటి ప్రశ్నల ను అడగవలసింది గా గౌరవనీయ పార్లమెంట్ సభ్యుల ను, అన్ని పక్షాల ను నేను కోరుకుంటున్నాను. అయితే, ఆ ప్రశ్నల కు జవాబులు చెప్పడానికి ఒక శాంతియుత వాతావరణం లో ప్రభుత్వాని కి అవకాశాన్ని కూడా ఇవ్వాలి. సత్యం ప్రజల కు అందినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అది ప్రజల విశ్వాసాన్ని పటిష్ట పరుస్తుంది కూడా. అంతేకాదు, అది అభివృద్ధి వేగాన్ని మెరుగుపరుస్తుంది.
మిత్రులారా, ఈ సమావేశాల కాలం లో ఆంతర్గతంగా చేసిన ఏర్పాటు కిందటి సారి మాదిరి గా లేదు. ప్రతి ఒక్కరు కూర్చొని కలసి పని చేయవచ్చును. ఎందుకు అంటే దాదాపు గా ప్రతి ఒక్కరు టీకా ను వేయించుకోవడమైంది. మీకు అందరికీ మరొక్క మారు ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం ఆశల ను, ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం మనమంతా కలసికట్టు గా పని చేద్దాం రండి
.
మిత్రులారా, చాలా ధన్యవాదాలు.
అస్వీకరణ : ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి ఇంచుమించుగా చేసిన అనువాదం. ప్రధాన మంత్రి మూల ప్రసంగం హిందీ భాష లో సాగింది.
**
(Release ID: 1736749)
Visitor Counter : 326
Read this release in:
Tamil
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam