ఆర్థిక మంత్రిత్వ శాఖ

శాసనసభ తో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జి.ఎస్.టి. పరిహారం కొరతగా - 75,000 కోట్ల రూపాయలు విడుదల


మొత్తం సంవత్సరానికి చెల్లించాల్సిన కొరతలో దాదాపు 50 శాతం - ఒకే విడతలో విడుదల

Posted On: 15 JUL 2021 6:23PM by PIB Hyderabad

జీ.ఎస్.టి. పరిహారాన్ని బ్యాక్-టు-బ్యాక్ లోన్ సౌకర్యం కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రోజు 75,000 కోట్ల రూపాయలను, శాసనసభతో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది.  వాస్తవ పన్నుల సేకరణ నుండి ప్రతి 2 నెలలకు విడుదల చేసే సాధారణ జి.ఎస్.టి. పరిహారానికి అదనంగా దీన్ని విడుదల చేశారు. 

 

 

 

2021 మే, 28వ తేదీన జరిగిన 43వ జీ.ఎస్.టి. కౌన్సిల్ సమావేశం అనంతరం,  కేంద్ర ప్రభుత్వం, 1.59 లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలనీ, పరిహార నిధిలో సరిపడ మొత్తం లేని కారణంగా పరిహారం స్వల్పంగా విడుదల చేయడం వల్ల వనరుల అంతరాన్ని తీర్చడానికి దానిని బ్యాక్-టు-బ్యాక్ ప్రాతిపదికన శాసనసభతో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని నిర్ణయించారు.  2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే విధమైన సౌకర్యం కోసం అనుసరించిన సూత్రాల ప్రకారం ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇదే విధమైన అమరిక కింద గత ఏడాది, రాష్ట్రాలకు 1.10 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో, శాసనసభ తో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసే ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా (పన్ను వసూలు ఆధారంగా), ఈ 1.59 లక్షల కోట్లు పరిహారం,  విడుదల చేయనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చే జి.ఎస్.టి. పరిహారం మొత్తాన్ని 2.59 లక్షల కోట్ల రూపాయలు అధిగమించవచ్చని అంచనా.

 

 

 

అర్హత కలిగిన అన్ని  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (శాసనసభ తో ఉన్న) బ్యాక్-టు-బ్యాక్ లోన్ సౌకర్యం కింద పరిహార కొరత నిధులు సమకూర్చుకోవడానికి అంగీకరించాయి.  కోవిడ్-19 మహమ్మారి యొక్క సమర్థవంతమైన ప్రతిస్పందన మరియు నిర్వహణతో పాటు మూలధన వ్యయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంది.   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నంలో సహాయపడటానికి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాక్-టు-బ్యాక్ ఋణ సౌకర్యం కింద, ఆర్థిక మంత్రిత్వ శాఖ 75,000 కోట్ల రూపాయలు (సంవత్సరానికి మొత్తం కొరతలో దాదాపు 50 శాతం) ఈ రోజు ఒకే విడతలో విడుదల చేసింది.  మిగిలిన మొత్తాన్ని 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో, స్థిరమైన వాయిదాలలో విడుదల చేయనున్నారు.

 

 

 

ఇప్పుడు విడుదల చేసిన 75,000 కోట్ల రూపాయల మేర నిధులను, 5 సంవత్సరాల సెక్యూరిటీల నుండి 68,500 కోట్ల రూపాయలు, 2 సంవత్సరాల సెక్యూరిటీల నుండి 6,500 కోట్ల రూపాయల మేర,  వరుసగా ఒక్కో దానిపైనా సంవత్సరానికి సగటున 5.60 మరియు 4.25 శాతం రాబడి తో, భారత ప్రభుత్వ రుణాల నుండి సమకూర్చుకోవడం జరిగింది.

 

 

 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర విషయాలతో పాటు తమ ప్రజా వ్యయాన్ని ప్రణాళికాబద్ధం చేసుకోవడంతో పాటు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడానికి, ఈ నిధుల విడుదల సహాయపడుతుందని భావిస్తున్నారు.

 

 

 

“జి.ఎస్.టి. పరిహార కొరతకు బదులుగా బ్యాక్ టు బ్యాక్ రుణంగా” రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 2021 జూలై, 15వ తేదీన విడుదల చేసిన మొత్తం వివరాలు 

 

 

(రూపాయలు కోట్లలో)

 

 

క్రమ సంఖ్య 

రాష్ట్రాలు / కేంద్రపాలిత 

ప్రాంతాల పేరు 

విడుదల చేసిన జి.ఎస్.టి. పరిహారం కొరత 

 ఐదేళ్ళలో

రెండేళ్ళలో

మొత్తం

1.

ఆంధ్రప్రదేశ్ 

1409.67

133.76

1543.43

2.

అస్సాం 

764.29

72.52

836.81

3.

బీహార్ 

2936.53

278.65

3215.18

4.

ఛత్తీస్ గఢ్ 

2139.06

202.98

2342.04

5.

గోవా  

364.91

 

34.63

399.54

6.

గుజరాత్ 

5618.00

533.10

6151.10

7.

హర్యానా 

3185.55

302.28

3487.83

8.

హిమాచల్ ప్రదేశ్ 

1161.08

110.18

1271.26

9.

ఝార్ఖండ్ 

1070.18

101.55

1171.73

10.

కర్ణాటక 

7801.86

740.31

8542.17

11.

కేరళ 

3765.01

357.26

4122.27

12.

మధ్యప్రదేశ్ 

3020.54

286.62

3307.16

13.

మహారాష్ట్ర 

5937.68

563.43

6501.11

14.

మేఘాలయ 

60.75

5.76

66.51

15.

ఒడిశా 

2770.23

262.87

3033.10

16.

పంజాబ్ 

5226.81

495.97

5722.78

17.

రాజస్థాన్ 

3131.26

297.13

3428.39

18.

తమిళనాడు 

3487.56

330.94

3818.50

19.

తెలంగాణ 

1968.46

186.79

2155.25

20.

త్రిపుర 

172.76

16.39

189.15

21.

ఉత్తర ప్రదేశ్ 

3506.94

332.78

3839.72

22.

ఉత్తరాఖండ్ 

1435.95

136.26

1572.21

23.

పశ్చిమ బెంగాల్ 

2768.07

262.66

3030.73

24.

కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ 

2668.12

253.18

2921.30

25.

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ 

1656.54

157.19

1813.73

26.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 

472.19

44.81

517.00

 

మొత్తం :

68500.00

6500.00

75000.00

 

 
*****


(Release ID: 1736073) Visitor Counter : 250