ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్‌వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
కోవిడ్ ఉన్నప్పటికీ, కాశీ లో అభివృద్ధి వేగం పదిలం గా ఉంది: ప్రధాన మంత్రి
ఈ కన్‌వెన్శన్ సెంటర్ భారతదేశాని కి, జపాన్ కు మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటుతోంది: ప్రధాన మంత్రి
ఈ కన్‌వెన్శన్ సెంటర్ ఒక సాంస్కృతిక కేంద్రం గాను, భిన్న ప్రజల ను ఏకం చేసే మాధ్యమం గాను ఉంటుంది: ప్రధాన మంత్రి
గత ఏడు సంవత్సరాల లో కాశీ కి అనేక అభివృద్ధి పథకాలు అలంకారాలు అయ్యాయి; రుద్రాక్ష్ లేనిదే ఆ అలంకారాలు సంపూర్ణం కావు: ప్రధాన మంత్రి
Posted On:
15 JUL 2021 3:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ అందించిన ఆర్థిక సహాయం తో వారాణసీ లో నిర్మాణం జరిగిన ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్‌వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ప్రారంభించారు. అటు తరువాత, ఆయన బిహెచ్ యు లోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని పరిశీలించారు. కోవిడ్ సన్నద్ధత ను సమీక్షించడం కోసం అధికారుల తోను, వైద్య వృత్తి నిపుణుల తోను ఆయన సమావేశమయ్యారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ ఉన్నప్పటికీ కాశీ లో అభివృద్ధి వేగం పదిలంగా ఉందన్నారు. ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్‌వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ఈ సృజనాత్మకత, ఈ చైతన్యం ల ఫలితమే అని ఆయన అన్నారు. భారతదేశాని కి, జపాన్ కు మధ్య ఉన్నటువంటి బలమైన బంధాన్ని ఈ సెంటర్ చాటుతోందని ఆయన అన్నారు. ఈ సమావేశ కేంద్రాన్ని నిర్మించడం లో సాయపడినందుకు జపాన్ ను ఆయన కొనియాడారు.
PMO India
@PMOIndia
कोरोनाकाल में जब दुनिया ठहर सी गई, तब काशी संयमित तो हुई, अनुशासित भी हुई, लेकिन सृजन और विकास की धारा अविरल बहती रही। काशी के विकास के ये आयाम, ये ‘इंटरनेशनल को-ऑपरेशन एंड कन्वेंशन सेंटर- रुद्राक्ष’ आज इसी रचनात्मकता का, इसी गतिशीलता का परिणाम है: PM @narendramodi
2:18 PM · Jul 15, 2021
1.4K
93
Share this Tweet
జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశీహిదే ఆ కాలం లో చీఫ్ కేబినెట్ సెక్రట్రి గా ఉన్నారని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. అప్పటి నుంచి ఆయన జపాన్ ప్రధాని అయ్యేటంత వరకు ఈ ప్రాజెక్టు లో ఆయన స్వీయ ప్రమేయం ఉందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం పట్ల శ్రీ సుగా యోశీహిదే కు గల ప్రీతి కి గాను భారతదేశం లోని ప్రతి ఒక్కరు ఆయన కు కృత జ్ఞులై ఉంటారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
PMO India
@PMOIndia
प्राइम मिनिस्टर श्री शुगा योशीहिदे जी उस समय चीफ़ कैबिनेट सेक्रेटरी थे। तब से लेकर पीएम की भूमिका तक, लगातार वो इस प्रोजेक्ट में व्यक्तिगत रूप से involve रहे हैं। भारत के प्रति उनके इस अपनेपन के लिए हर एक देशवासी उनका आभारी है: PM @narendramodi
2:20 PM · Jul 15, 2021
1.2K
50
Share this Tweet
ఈ రోజు న జరిగిన కార్యక్రమం తో సన్నిహితం గా మెలగిన జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. శ్రీ శింజో ఆబే జపాన్ ప్రధాని గా ఉన్న కాలం లో కాశీ కి విచ్చేసినప్పుడు, ఆయన తో రుద్రాక్ష్ తాలూకు ఆలోచన పై తాను చర్చించిన సందర్బాన్ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ భవనాని కి ఆధునికత వెలుగు తో పాటు సాంస్కృతిక ప్రకాశం కూడా ఉందని, భారతదేశం-జపాన్ సంబంధాల తో ఈ భవనం ముడిపడి ఉందని, అంతేకాక భావి సహకారం తాలూకు అవకాశం కూడా ఈ భవనాని కి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. జపాన్ ను తాను సందర్శించినప్పటి నుండి ఈ విధమైన ప్రజా సంబంధాల ను గురించి ఆలోచన చేయడమైందని, రుద్రాక్ష్ తో పాటు, అహమదాబాద్ లో జెన్ గార్డెన్ వంటి పథకాలు ఈ సంబంధానికి ప్రతీక గా నిలుస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
PMO India
@PMOIndia
आज के इस आयोजन में एक और व्यक्ति हैं, जिनका नाम लेना मैं भूल नहीं सकता। जापान के ही मेरे एक और मित्र- शिंजो आबे जी। मुझे याद है, शिंजों आबे जी जब प्रधानमंत्री के तौर पर काशी आए थे, तो रुद्राक्ष के आइडिया पर उनसे मेरी चर्चा हुई थी: PM @narendramodi
2:22 PM · Jul 15, 2021
1.5K
51
Share this Tweet
ప్రస్తుతం వ్యూహాత్మక రంగం లో, ఆర్థిక రంగం లో భారతదేశాని కి అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశాల లో ఒక మిత్ర దేశం గా ఉన్నందుకు జపాన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. జపాన్ తో భారతదేశాని కి ఉన్న మైత్రి యావత్తు ప్రాంతం లో అత్యంత స్వాభావికమైన భాగస్వామ్యాల లో ఒకటి గా లెక్క కు వస్తోందని ఆయన అన్నారు. మన అభివృద్ధి మన నడవడిక తో ముడిపడి ఉండాలని భారతదేశం- జపాన్ లు భావిస్తున్నాయి. ఈ అభివృద్ధి సర్వతోముఖం గాను, సర్వుల కోసమూను, సర్వ వ్యాప్తం గాను ఉండాలి అని ఆయన అన్నారు.
పాటలు, సంగీతం, కళ బనారస్ నాడుల లో నుంచి ప్రవహిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ మాత గంగా తీరం లోని ఘట్టాల పైన ఎన్నో కళ లు ప్రాణం పోసుకొన్నాయి, జ్ఞానం శిఖర స్థాయి ని చేరుకొంది, మానవాళి కి సంబంధించిన అనేక గంభీరమైన భావాలు జనించాయి అని ఆయన చెప్పారు. ఆ రకం గా బనారస్ సంగీతాని కి, ధర్మాని కి, ఆత్మ కు, జ్ఞానాని కి, విజ్ఞానాని కి సంబంధించిన ఒక పెద్ద ప్రపంచ కేంద్రం గా మారగలదు అని ఆయన చెప్పారు. ఈ సెంటర్ ఒక సాంస్కృతిక కేంద్ర బిందువు గా, విభిన్న రకాల ప్రజల ను ఏకం చేసే మాధ్యమం గా రూపుదిద్దుకొంటుందన్నారు. ఈ సెంటర్ ను కాపాడుకోండి అంటూ కాశీ ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
PMO India
@PMOIndia
चाहे strategic एरिया हो या economic एरिया, जापान आज भारत के सबसे विश्वसनीय दोस्तों में से एक है। हमारी दोस्ती को इस पूरे क्षेत्र की सबसे natural partnerships में से एक माना जाता है: PM @narendramodi
2:23 PM · Jul 15, 2021
1.9K
88
Share this Tweet
PMO India
@PMOIndia
भारत और जापान की सोच है कि हमारा विकास हमारे उल्लास के साथ जुड़ा होना चाहिए। ये विकास सर्वमुखी होना चाहिए, सबके लिए होना चाहिए, और सबको जोड़ने वाला होना चाहिए: PM @narendramodi
2:25 PM · Jul 15, 2021
2.1K
101
Share this Tweet
గత ఏడేళ్ళ లో ఎన్నో అభివృద్ధి పథకాలు కాశీ కి ఆభరణాలు గా మారాయని, ఈ అలంకరణ అనేది రుద్రాక్ష లేకుండా ఏ విధం గా ముగియగలదు ? అని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు ఇక సిసలైన శివుడు ధరించినటువంటి కాశీ, ఈ రుద్రాక్ష తో జతపడి, మరింత గా తళుకులీనుతుందని, మరి కాశీ శోభ ఇంకా కాస్త ఇనుమడిస్తుందని ఆయన చెప్పారు.
PMO India
@PMOIndia
बनारस के तो रोम रोम से गीत संगीत और कला झरती है। यहाँ गंगा के घाटों पर कितनी ही कलाएं विकसित हुई हैं, ज्ञान शिखर तक पहुंचा है और मानवता से जुड़े कितने गंभीर चिंतन हुये हैं। इसीलिए, बनारस गीत-संगीत का, धर्म-आध्यात्म का और ज्ञान-विज्ञान का एक बहुत बड़ा ग्लोबल सेंटर बन सकता है: PM
2:27 PM · Jul 15, 2021
2.2K
209
Share this Tweet
PMO India
@PMOIndia
काशी तो साक्षात् शिव ही है। अब जब पिछले 7 सालों में इतनी सारी विकास परियोजनाओं से काशी का श्रंगार हो रहा है, तो ये श्रंगार बिना रुद्राक्ष के कैसे पूरा हो सकता था? अब जब ये रुद्राक्ष काशी ने धारण कर लिया है, तो काशी का विकास और ज्यादा चमकेगा, और ज्यादा काशी की शोभा बढ़ेगी: PM
2:31 PM · Jul 15, 2021
2.2K
190
Share this Tweet
https://youtu.be/_wSqPYrrjJ4
(Release ID: 1735904)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam