మంత్రిమండలి

ఆరోగ్యం- వైద్యం రంగం లో సహకారం పై భార‌త‌దేశాని కి, కింగ్ డ‌మ్ ఆఫ్ డెన్ మార్క్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 14 JUL 2021 4:07PM by PIB Hyderabad

ఆరోగ్యం- వైద్యం రంగం లో స‌హ‌కారం అనే అంశం పై భార‌త గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వం లోని ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు, కింగ్ డ‌మ్ ఆఫ్ డెన్ మార్క్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి (ఎమ్ఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ద్వైపాక్షిక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం ఆరోగ్య రంగం లో సంయుక్త కార్య‌క్ర‌మాలు, సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి మాధ్యమం ద్వారా భార‌త గ‌ణ‌తంత్రాని కి చెందిన ఆరోగ్యం- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, కింగ్ డ‌మ్ ఆఫ్ డెన్ మార్క్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిస్తుంది.  ఈ ఒప్పందం భార‌త‌దేశాని కి, డెన్ మార్క్ కు మ‌ధ్య గ‌ల ద్వైపాక్షిక సంబంధాల ను ప‌టిష్టం చేస్తుంది.

ఈ ద్వైపాక్షిక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం ఆరోగ్య రంగం లో పరిశోధనల వికాసం మాధ్యమం ద్వారా భార‌త గ‌ణ‌తంత్రాని కి చెందిన ఆరోగ్యం- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, కింగ్ డ‌మ్ ఆఫ్ డెన్ మార్క్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.  దీని తో ఉభ‌య దేశాల లోను ప్ర‌జ‌ల సార్వ‌జ‌నిక ఆరోగ్య స్థితి ని మెరుగు ప‌ర‌చ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది.  



 

*** 


(Release ID: 1735540) Visitor Counter : 257