మంత్రిమండలి
నార్త్ ఈస్ట్రన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ (ఎన్.ఇ.ఐ.ఎఫ్.ఎం) పేరును నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రిసెర్చ్ (ఎన్.ఇ.ఐ.ఎ.ఎఫ్.ఎం.ఆర్)గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం.
Posted On:
14 JUL 2021 3:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్రకేబినెట్, నార్త్ ఈస్ట్రన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ (ఎన్.ఇ.ఐ.ఎఫ్.ఎం) పేరును నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రిసెర్చ్ (ఎన్.ఇ.ఐ.ఎ.ఎఫ్.ఎం.ఆర్)గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.
వివరాలు :
అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌వద్ద ఆయుర్వేదం, జానపద వైద్యానికి సంబంధించి నాణ్యమైన విద్య పరిశోధనను అందించేందుకు నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోక్ మెడిసిన్ (ఎన్.ఇ.ఐ.ఎఫ్.ఎం) ను నార్త ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రిసెర్చ్ (ఎన్.ఇ.ఐ.ఎ.ఆర్.ఎం.ఆర్) గా మార్చే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్పులను మెమరాండం ఆఫ్ అసోసియేషన్, నియమాలు, నిబంధనలలో కూడా చేపడతారు.
ప్రభావం:
ఈ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలలో ఆయుర్వేదను చేర్చడం వల్ల ఈశాన్య ప్రాంత ప్రజలకు ఆయుర్వేదం. జానపద వైద్యంలో నాణ్యమైన విద్య . పరిశోధనను అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంస్థ కు చెందిన ఆయుర్వేద, జానపద వైద్యానికి సంబంధించిన విద్యార్థులకు ఇండియాలో నే కాకుండా పొరుగున ఉన్న టిబెట్, భూటాన్, మంగోలియా, నేపాల్, చైనా, ఇతర మధ్య ఆసియా దేశాలలో అవకాశాలను కల్పిస్తుంది.
నేపథ్యం:
అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసి ఘాట్ వద్ద ఈ ప్రాంతంలోని సంప్రదాయ జానపద వైద్యం, ఆరోగ్య విధానాలకు సంబంధించి ఒక పద్ధతి ప్రకారం పరిశోధన జరిపి దాని సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచేందుకు ఎన్.ఇ.ఐ.ఎఫ్.ఎం ను ఏర్పాటు చేశారు. సంప్రదాయం విధానాల ద్వారా వ్యాధులు నయం చేసే వారికి, ఆధునిక శాస్త్ర పరిశోధనలకు మధ్య సమన్వయం ఏర్పరచడం, సర్వే, డాక్యుమెంటేషన్, జానపద వైద్య విధానాలకు గుర్తింపు , ప్రజారోగ్య వైద్య విధానంలో వాడుకోవడానికి అవకాశం ఉన్న చికిత్సలు, పరిష్కారాల సమాచారం, భవిష్యత్ పరిశోధన వంటివి దీని పరిధికిందికి వస్తాయి.
***
(Release ID: 1735520)
Visitor Counter : 225
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam