మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యాశాఖ చేపట్టిన 'డిజిటల్‌ ఎడ్యుకేషన్‌' కార్యక్రమాలపై శ్రీ ప్రధాన్‌ సమీక్ష

Posted On: 13 JUL 2021 1:27PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ చేపట్టిన 'డిజిటల్‌ ఎడ్యుకేషన్‌' పురోగతిపై, ఆ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్‌ డిజిటల్ ఎడ్యుకేషన్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌డీఈఏఆర్‌), స్వయం సహా ఇతర కార్యక్రమాలను కూడా సమీక్షించారు. సహాయ మంత్రులు శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌, డా.సుభాశ్‌ శంకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్‌ అధికారులు విద్యా కార్యక్రమాల గురించి మంత్రులకు వివరించారు. 

Emphasizing the importance of leveraging technology in Education, Shri Pradhan said that technology would help in achieving the goals of an open, inclusive and accessible education. A vibrant digital ecosystem in education will expand learning opportunities for the students, spur innovation and entrepreneurship in the Education sector, he added.

    విద్యలో సాంకేతికత ఆవశ్యకతను వివరించిన శ్రీ ప్రధాన్‌; దూర, సమగ్ర విద్యా లక్ష్యాలను సాధించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. విద్యారంగంలో శక్తిమంతమైన డిజిటల్ వ్యవస్థ విద్యార్థుల అభ్యాసన అవకాశాలను విస్తరించడంతోపాటు, ఆవిష్కరణలు, విద్యాలయాల స్థాపనను పెంచుతుందని అన్నారు.

    డిజిటల్‌ మాధ్యమం దిశగా అడుగేయాల్సిన అవసరాన్ని కొవిడ్‌ సృష్టించిందన్న శ్రీ ప్రధాన్‌; దేశంలో విద్యాభ్యాసన ఆగకుండా మంత్రిత్వ శాఖ చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, సంస్థాగతీకరిస్తాయని అభయం ఇచ్చారు.
 

*****



(Release ID: 1735052) Visitor Counter : 208