కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రావ్ ఇందర్‌జీత్ సింగ్
Posted On:
12 JUL 2021 12:30PM by PIB Hyderabad
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసిఎ) సహాయ మంత్రిగా రావ్ ఇందర్‌జీత్ సింగ్ సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఎంసిఎ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సింగ్ అప్పటికే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (గణాంకాలు, కార్యక్రమాల అమలు), ప్లానింగ్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజేష్ వర్మ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నమంత్రి రావ్ ఇందర్‌జీత్ సింగ్ కు స్వాగతం పలికారు.
పదిహేడవ లోక్ సభలో గుర్‌గాంవ్ నియోజకవర్గానికి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తూ, సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు ఐదవ సారి ఎంపీగా సేవలను అందిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్న సింగ్, ఇంతకు ముందు హర్యానాలోని జతుసనా విధాన సభ సభ్యుడిగానే గాక హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సింగ్ గ్రాడ్యుయేషన్ ను, ఎల్ ఎల్ బిని పూర్తి చేశారు. వృత్తిపరంగా న్యాయవాది, వ్యవసాయదారుడు అయిన సింగ్ 71 ఏళ్ళ వయసులో కూడా రాజకీయాలలోనూ, సమాజసేవలో చురుకుగా పాల్గొంటున్నారు.
భారత తొలి స్వతంత్ర పోరాటం అయిన తిరుగుబాటులో పాలుపంచుకున్న రావ్ తులారాం వంశానికి చెందినవాడు సింగ్.
***
(Release ID: 1734849)
Visitor Counter : 165