ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 3 కోట్లు దాటిన కోలుకున్నవారి సంఖ్య


దేశమంతటా ఇప్పటిదాకా 37.73 కోట్లకు పైగా టీకా డోసులు
గత 24 గంటల్లో 37,154 కొత్త కోవిడ్ కేసుల నమోదు

చికిత్సలో ఉన్న కేసులు 4,50,899; మొత్తం కేసుల్లో1.47% మాత్రమే
రోజువారీ పాజిటివిటీ 2.59%, 21 రోజులుగా 3% లోపే

Posted On: 12 JUL 2021 11:24AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరు విజయవంతంగా సాగుతోందనటానికి నిదర్శనంగా దేశంలో ఇప్పటిదాకా కోవిడ్ నుంచి బైటపడినవారి సంఖ్య 3 కోట్లు

దాటింది. మొత్తం  3,00,14,713 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కోలుకున్నవారు 39,649  కాగా మొత్తం

 కోలుకున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ 97.22% కు చేరింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016RD5.jpg

మరోవైపు దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డొసుల సంఖ్య  37.73 కోట్లు దాటి 37,73,52,501 కు చేరింది. 48,51,209  శిబిరాల ద్వారా

ఈ పంపిణీ జరిగినట్టు ఈ ఉదయానికి అందిన సమాచారం తెలియజేస్తోంది. గత 24 గంటలలో 12,35,287 టీకా డొసుల పంపిణీ

జరిగింది.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,49,021

రెండవ డోస్

74,07,589

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,76,68,922

రెండవ డోస్

99,13,421

18-44 వయోవర్గం

మొదటి డోస్

11,24,48,511

రెండవ డోస్

37,46,523

 45-59 వయోవర్గం

మొదటి డోస్

9,35,18,992

రెండవ డోస్

2,38,13,758

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,01,33,406

రెండవ డోస్

2,84,52,358

మొత్తం

37,73,52,501

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  

చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  37,154 కొత్త కరోనా కేసులు

 నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 15 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల

ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002RSZX.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,50,899 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.46మాత్రమే.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00316BC.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 14,32,343 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన

మొత్తం పరీక్షలు 43 కోట్లకు పైగా (43,23,17,813) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ 

తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.32% కాగా రోజువారీ పాజిటివిటీ  2.59%  అయింది. వరుసగా 21 రోజులుగా

ఇది 3% లోపు,  35 రోజులుగా 5% లోపే ఉంటోంది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UMHG.jpg

 

***


(Release ID: 1734777) Visitor Counter : 214