ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో ఇప్పటిదాకా 37.21 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు


త 24 గంటలలో 42,766 కొత్త కోవిడ్ కేసులు

చికిత్సలో ఉన్న కేసులు 4,55,033; మొత్తం కేసుల్లో 1.48%

రోజువారీ పాజిటివిటీ 2.19%; నెలకు పైగా 5% లోపే

Posted On: 10 JUL 2021 9:44AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 37 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 48,04,423 శిబిరాల ద్వారా 37,21,96,268 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 30,55,802 టీకాలిచ్చారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.  

 

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,44,459

రెండో డోస్

73,84,439

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,76,51,159

రెండో డోస్

98,42,138

18-44 వయోవర్గం

మొదటి డోస్

11,00,15,954

రెండో డోస్

35,15,490

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,29,29,982

రెండో డోస్

2,27,96,218

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,99,01,188

రెండో డోస్

2,79,15,241

మొత్తం

37,21,96,268

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  42,766  కొత్త కరోనా కేసులు  నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 13 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 

 

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,55,033 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.48మాత్రమే.

\

 

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ 2,99,33,538 కు చేరింది. కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ  ఉన్నారు. గత 24  గంటలలో  45,254 మంది కోలుకున్నారు.  దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 97.20% కు చేరింది.

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 19,55,225 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 42.90 కోట్లకు పైగా (42,90,41,970) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.34% కాగా రోజువారీ పాజిటివిటీ  2.42%  అయింది. వరుసగా 19 రోజులుగా ఇది 3% లోపు,  33 రోజులుగా 5% లోపే ఉంటోంది

 


(Release ID: 1734526) Visitor Counter : 177