ప్రధాన మంత్రి కార్యాలయం
కల్యాణ్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అసంఖ్యాక ప్రజానీకం తో పాటు తాను కూడా ప్రార్థిస్తున్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 JUL 2021 10:13AM by PIB Hyderabad
కల్యాణ్ సింహ్ గారి మనవడి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. జబ్బుపడ్డ కల్యాణ్ సింహ్ గారికి త్వరగా నయం అవ్వాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు. కల్యాణ్ సింహ్ గారి తో తాను జరిపిన సమావేశాల గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు. కల్యాణ్ సింహ్ గారి తో మాట్లాడిన ప్రతి సారీ తాను పలు విషయాలు నేర్చుకోగలిగానని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు:
‘‘ భారతదేశం అంతటా లెక్కపెట్టలేనంత మంది కల్యాణ్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి అని ప్రార్థన లు చేస్తున్నారు. నిన్నటి రోజు న, @JPNadda Ji, ముఖ్యమంత్రి @myogiadityanath Ji మరియు ఇతరులు ఆయన ను కలుసుకోవడం కోసమని ఆసుపత్రి కి వెళ్లారు. నేను కాసేపటి క్రితమే ఆయన మనవడి తో మాట్లాడాను, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొన్నాను.
కల్యాణ్ సింహ్ గారు @JPNadda Ji తో మాట్లాడినప్పుడు నా గురించి గుర్తు కు తెచ్చుకొన్నారని తెలిసి నేను చలించిపోయాను. కల్యాణ్ సింహ్ గారి తో నేను జరిపిన సంభాషణ ల తాలూకు జ్ఞాపకాలు నాకు కూడాను అనేకం ఉన్నాయి. అటువంటి స్మృతుల లో అనేకం తిరిగి ప్రాణం పోసుకొన్నాయి. ఆయనతో మాట్లాడటం అంటే అది ఎల్లప్పటికీ ఒక జ్ఞానార్జన తాలూకు అనుభవం వంటిదే. ’’
******
DS/SH
(రిలీజ్ ఐడి: 1734128)
సందర్శకుల సూచీ సంఖ్య : : 174
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada