ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర నిధుల తో నడుస్తున్న సాంకేతిక సంస్థ ల డైరెక్టర్ లతో సమావేశమైన ప్రధాన మంత్రి
శీఘ్ర సాంకేతిక పరిష్కార మార్గాల ను అందించే దిశ లో యువ నూతన ఆవిష్కర్త ల ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
మార్పు చేర్పుల కు అనువైనటువంటి, అంతరాయాల కు తావు లేనటువంటి, జ్ఞానార్థుల అవసరాల కు అనుగుణం గా జ్ఞానార్జన అవకాశాల ను అందించగలిగినటువంటి విద్య నమూనా ల వైపునకు సాగిపోవలసిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి
రానున్న దశాబ్దం.. ‘ఇండియాస్ టెకేడ్’ లో మన సాంకేతిక విజ్ఞాన సంస్థలు, ఆర్&డి సంస్థలు ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తాయి: ప్రధాన మంత్రి
ప్రస్తుతం జరుగుతున్న ఆర్ & డి కృషి ని గురించి, ప్రత్యేకించి కోవిడ్ కు సంబంధించిన కార్యాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించడమైంది
Posted On:
08 JUL 2021 2:07PM by PIB Hyderabad
కేంద్ర నిధుల అండదండల తో నడుస్తున్న సాంకేతిక విజ్ఞాన సంస్థ ల డైరెక్టర్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 8న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. 100కు పైగా సంస్థల అధిపతులు ప్రధాన మంత్రి తో పాటు ఈ సంభాషణ లో పాల్గొన్నారు.
కోవిడ్ రువ్విన సవాళ్ళ కు ఎదురొడ్డి నిలవడం లో ఈ సంస్థ లు పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) పరంగా చేసిన కృషి ని ప్రధాన మంత్రి కొనియాడారు. సత్వర సాంకేతిక పరిష్కార మార్గాల ను అందించే దిశ లో యువ నూతన ఆవిష్కర్తలు చేస్తున్న ప్రయత్నాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ఎప్పటికప్పుడు మార్పుల కు లోనవుతున్న స్థితిగతులు, కొత్త గా ఎదురవుతున్న సవాళ్ళ కు తగ్గట్లు ఉన్నత విద్య ను, సాంకేతిక విద్య ను మలచుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది జరగాలంటే సంస్థ లు వాటిమూలాల లోకి తిరిగి వెళ్ళి, పునర్ మూల్యాంకనం చేసుకోవలసిన అవసరం తో పాటు సమాజ, దేశ వర్తమాన కాలం అవసరాల ను, రాబోయే కాలం అవసరాల ను కూడా దృష్టి లో పెట్టుకొని వినూత్నమైన ప్రత్యామ్నాయ నమూనాల ను అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. మన ఉన్నత విద్య సంస్థ లు, సాంకేతిక సంస్థ లు మన యువత ను నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టి లో పెట్టుకొంటూ, ఎప్పటికప్పుడు చోటు చేసుకొనే పరిణామాల కు తగినట్లుగా సిద్ధం చేయాలి అని ఆయన స్పష్టం చేశారు.
మార్పు చేర్పుల కు వీలు ఉన్నటువంటి, అంతరాయాల కు తావు ఉండనటువంటి, జ్ఞానార్థుల అవసరాల కు తగ్గట్లు వారికి జ్ఞానార్జన అవకాశాలను అందజేయగలిగేటటువంటి విద్య నమూనాల వైపునకు సాగిపోవలసి ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అందుబాటు, సమాన అవకాశాలు, నాణ్యత అనేవి అటువంటి విద్య నమూనా ల తాలూకు ముఖ్య విలువలు గా ఉండాలి అని ప్రధాన మంత్రి అన్నారు.
గడచిన కొన్ని సంవత్సరాల కాలం లో ఉన్నత విద్య లో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) మెరుగు పడటాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఉన్నత విద్య డిజిటలీకరణ అనేది జిఇఆర్ ను పెంపొందించడం లో ఒక ప్రముఖ పాత్ర ను పోషించగలుగుతుందని, మరి విద్యార్థులు మంచి నాణ్యత కలిగిన, తక్కువ ఖర్చు తో లభించేటటువంటి విద్య ను ఇట్టే అందుకోగలుగుతారని ప్రధాన మంత్రి అన్నారు. డిజిటలీకరణ ను పెంచడానికి గాను ఆన్ లైన్ బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాముల వంటి అంశాల తో సంస్థ లు చేపట్టిన వివిధ కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
మనం సాంకేతిక విజ్ఞాన సంబంధ విద్య తాలూకు వ్యవస్థ ను భారతీయ భాషల లో అభివృద్ధి పరచవలసిన అవసరానికి తోడు ప్రపంచ స్థాయి పత్రికల ను ప్రాంతీయ భాషల లోకి అనువాదం చేయవలసిన అవసరం కూడా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ అనేది మనం స్వాతంత్య్రం సాధన అనంతరం 100 సంవత్సరాల ను జరుపుకోబోయే రానున్న 25 ఏళ్ళ కాలం లో భారతదేశం కలల కు, భారతదేశం ఆకాంక్షల కు ఆధారం గా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే దశాబ్ది ని ‘ఇడియాస్ టెకేడ్’ అని కూడా వ్యవహరించడం జరుగుతోందని, ఆ పదేళ్ళ కాలం లో సాంకేతిక విజ్ఞాన సంస్థ లు, ఆర్ & డి సంస్థ లు ఒక ప్రధాన పాత్ర ను పోషించనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల లో భావి కాలాని కి అవసరపడే పరిష్కారాల ను అభివృద్ధి పరచడం పై మనం శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు.
ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ వేరబుల్స్, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ సిస్టమ్స్, డిజిటల్ అసిస్టెంట్స్ లతో అనుబంధం ఉన్న ఉత్పత్తులు సామాన్య మానవుడి కి చేరువ అయ్యేటట్లు చూడటానికి గాను ఉన్నత విద్య సంస్థల లో మంచి నాణ్యమైన, మౌలిక సదుపాయాలు నెలకొనడం ముఖ్యం అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. మనం తక్కువ ఖర్చు అయ్యేటటువంటి, ప్రతి ఒక్కరి కి తగినట్లు ఉండేటటువంటి, ఎఐ ఆలంబన గా కలిగినటువంటి విద్య బోధన పైన శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు.
సమావేశం లో ఐఐఎస్‌సి బెంగళూరు కు చెందిన ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్, ఐఐటి బాంబే కు చెందిన ప్రొఫెసర్ సుభాశీస్ చౌధురి, ఐఐటి మద్రాసు కు చెందిన ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి, ఐఐటి కాన్ పుర్ కు చెందిన ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ లు దేశం లో ప్రస్తుతం పురోగమనం లో ఉన్న వివిధ పథకాలు, విద్యారంగ సంబంధ కృషి, కొత్త పరిశోధన లను గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. కోవిడ్ కు సంబంధించిన పరిశోధన ను గురించి ప్రధాన మంత్రి కి వివరించడమైంది. దీనిలో భాగం గా పరీక్షలకై ఉద్దేశించిన కొత్త మెలకువ లు, కోవిడ్ కు టీకామందులను అభివృద్ధి పరచే ప్రయాస లు, దేశీయం గా ఆక్సీజన్ కాన్స్‌ట్రేటర్ లు, ఆక్సీజన్ జనరేటర్ లు, కేన్సర్ సెల్ థెరపీ, మాడ్యులర్ హాస్పిటల్స్, అధిక ముప్పు ప్రాంతాల పట్ల అంచనా, వెంటిలేటర్ ల ఉత్పత్తి వంటి అంశాలు ఉన్నాయి. రోబోటిక్స్, డ్రోన్స్, ఆన్‌లైన్ మాధ్యమం లో విద్య బోధన, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానం.. ఈ రంగాల లో జరుగుతున్న ప్రయాసల ను నివేదించడమైంది. మార్పుల కు లోనయ్యే స్వభావం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా సరికొత్త గా రూపుదిద్దుకొంటూ ఉన్న విద్య సంబంధ పాఠ్య క్రమాలు, ప్రత్యేకించి ఆన్ లైన్ కోర్సు లు వంటి వాటిని గురించి కూడా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడం జరిగింది.
ఈ సమావేశం లో కేంద్ర విద్య శాఖ మంత్రి, విద్య శాఖ సహాయ మంత్రులు కూడా పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1734110)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam