సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాచార ప్రసారశాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
08 JUL 2021 12:04PM by PIB Hyderabad
సమాచార ప్రసార శాఖ మంత్రిగా శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నం చేశారన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన ఈ మిషన్ ను మరింత ముందుకు తీసుకుపోవడం , సమాచార ప్రసార శాఖ మంత్రిగా తన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తానని, ఈ దిశగా ముందుకు సాగేందుకు మీడియా సహకారాన్ని ఆయన కోరారు.
సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరే , మంత్రికి తన ఛాంబర్‌లో స్వాగతం పలికారు. వివిధ మీడియా యూనిట్లు, ప్రసార భారతి సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అందరు మీడియా అధిపతులతో కలిసి ఒక టీమ్‌గా ముందుకు సాగేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు.
***
(Release ID: 1733611)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam