కేంద్ర మంత్రివర్గ సచివాలయం

కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించిన - మోదీ ప్రభుత్వం

Posted On: 06 JUL 2021 10:22PM by PIB Hyderabad

చారిత్రాత్మక చర్యలో భాగంగా, ‘సహకార్ సే సమృధి’ ఆలోచనను సాకారం చేసుకునే దిశగా, మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ ను రూపొందించింది.

దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వీలుగా, ఈ మంత్రిత్వ శాఖ, ఒక ప్రత్యేక పరిపాలన, చట్టపరమైన, విధానపరమైన రూపాన్ని అందిస్తుంది.

వాస్తవ ప్రజల ఆధారిత ఉద్యమంగా సహకార సంస్థలను, క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టం చేయటానికి, ఈ మంత్రిత్వ శాఖ, సహాయ పడుతుంది.

మన దేశంలో, ప్రతి సభ్యుడు బాధ్యతతో పనిచేసే చోట, సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి నమూనా చాలా సందర్భోచితంగా ఉంటుంది.

సహకార సంస్థల కోసం ‘సులభతరం వ్యాపారం’ కోసం ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు బహుళ-రాష్ట్ర సహకార (ఎం.ఎస్‌.సి.ఎస్) సంస్థల అభివృద్ధిని ప్రారంభించడానికి, ఈ మంత్రిత్వ శాఖ పని చేస్తుంది.

సమాజ ఆధారిత అభివృద్ధి భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వ లోతైన నిబద్ధతకు, ఇది ఒక సంకేతం.  ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించనున్నట్లు, బడ్జెట్ సందర్భంగా, ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్ ప్రకటనను నెరవేర్చే దిశగా కూడా, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.(Release ID: 1733276) Visitor Counter : 378