సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ చలన చిత్ర నిర్మాతలకు భారతదేశంలో ఫెసిలిటేషన్ కార్యాలయం: అన్ని ఆమోదాలు ఒకేసారి జారీ : శ్రీ ప్రకాష్ జవదేకర్
74 వ కేన్స్ చలన చిత్రోత్సవంలో వర్చువల్ ‘ఇండియా పెవిలియన్’ ను ప్రారంభించిన సమాచార, ప్రసార శాఖ మంత్రి
Posted On:
06 JUL 2021 4:37PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడి సినిమాలను చూడడానికి ప్రజలు తిరిగి థియేటర్లకు వస్తారన్న ఆశాభావాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ వ్యక్తం చేశారు. 74 వ కేన్స్ చలన చిత్రోత్సవాన్ని ఈ రోజు మంత్రి ప్రారంభించారు. , ఫిక్కీతో కలసి భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 74 వ కేన్స్ చలన చిత్రోత్సవంలో నిర్వహించిన 'ఇండియా పెవిలియన్'ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి వరుసగా రెండవ సంవత్సరం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే భారతదేశం అత్యుతమ సృజనాత్మకత, ప్రతిభ, సాంకేతికతతో కూడిన వ్యాపార అవకాశాలను అందిస్తున్నదని అన్నారు. ' వర్చువల్ విధానంలో జరిగే ఇండియన్ పెవిలియన్ ప్రపంచ సినిమా భవిష్యత్ ఎలా వుంటుందనే అంశాన్ని చర్చించడానికి అత్యుత్తమ వేదికగా ఉంటుంది "అని మంత్రి అన్నారు.
భారతదేశంలో అనేక అంతర్జాతీయ చిత్రాల నిర్మాణం సాగుతున్నదని మంత్రి అన్నారు. సినిమాలను చిత్రీకరించడానికి భారతదేశంలో 500 కి పైగా అనువైన ప్రదేశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. మరిన్ని చిత్రాలను భారతదేశంలో నిర్మించేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని మంత్రి అన్నారు. ' సినిమాలను నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచాము,'అని మంత్రి తెలిపారు.
అనేక హాలీవుడ్ చిత్రాలు తమ విఎఫ్ఎక్స్ యానిమేషన్‌ను భారతదేశంలో పూర్తి చేసుకుంటున్నాయని తెలిపిన శ్రీ జవదేకర్ చలనచిత్ర రంగంలో భారతదేశ పాత్ర పెరుగుతున్నదని అన్నారు. '"కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సృజనాత్మకత ప్రతిభ కు మాత్రమే కాకుండా వ్యాపారానికి కూడా ఒక వేదిక. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ చిత్ర నిర్మాతలకు వ్యాపార అవకాశాలను అందిస్తుంది. మహమ్మారి తర్వాత సినిమాలు భారీ వ్యాపారం చేస్తాయి . అనేక సినిమాలు ఓటిటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కూడా చిత్రీకరించబడుతున్నాయి ” అని మంత్రి తెలిపారు.
భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక ముఖ్యమైన వేదికగా ఉంటుందని ఫ్రాన్స్ లో భారత రాయబారి శ్రీ జావేద్ అష్రాఫ్ అన్నారు. కోవిడ్ వల్ల ప్రభావితమై సంబంధాలు కోల్పోయిన ప్రపంచ చలన చిత్ర రంగాన్ని ఈ ఉత్సవం తిరిగి దగ్గర చేస్తుందని ఆయన వివరించారు. దీని ద్వారా అంతర్జాతీయ సహకారంతో భారతదేశాన్ని ప్రపంచ సినిమా చిత్రీకరణ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం కలుగుతుందని అన్నారు. స్థానిక సినిమా పరిశ్రమపై ఓటిటీ డిజిటల్ వేదిక ప్రాధాన్యతను కూడా ఈ ఉత్సవం ద్వారా చర్చించడానికి వీలవుతుందని అన్నారు. భారతదేశ వైవిధ్యానికి సినిమా అద్దం పడుతుందని అన్న శ్రీ జావేద్ అష్రాఫ్ దేశాన్ని సమైక్యంగా ఉంచే అంశంలో ఈ రంగం అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తున్నదని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతావని సాధించిన ప్రగతికి సినిమా రంగం ఒక నిదర్శనమని ఆయన అన్నారు.
అత్యధికంగా సినిమాలను నిర్మిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటని భారత ప్రభుత్వ ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే అన్నారు. "మహమ్మారి రూపంలో ఎదురైన సవాళ్లను అధిగమించి చలన చిత్ర నిర్మాణం తో పాటు సాంస్కృతిక మరియు సినిమా రంగం సాధించిన పురోగతి ఇండియా పెవిలియన్ ద్వారా ప్రదర్శిస్తున్నాము" అని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం సత్యజిత్ రే శతాబ్ది సంవత్సర వేడుకలతో పాటు భారత స్వాతంత్ర్యం 75 వ సంవత్సర వేడుకల నిర్వహణకు భారతదేశం సిద్ధం అవుతున్నదని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సినిమా ప్రతి ఒక్కరిని ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చిందని భారత ప్రభుత్వ ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎంఎస్ నీర్జా శేఖర్ అన్నారు. ఈ ఉత్సవంలో అత్యుత్తమ సినిమాలను చూడడానికి తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికి భారతీయ చిత్ర నిర్మాతలకు అవకాశం కలుగుతుందని అన్నారు.
ప్రాంతీయ సినిమాపై దృష్టి పెట్టడంతో సినిమా నిర్మాతలతో పాటు భారతీయ సినిమా రంగం సరైన దిశలో పయనిస్తోందని సిబిఎఫ్‌సి చైర్మన్ రచయిత, కవి శ్రీ ప్రసూన్ జోషి అన్నారు. మంచి సినిమాల కోసం భారత ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఉత్సవాలు ప్రపంచ సినీ రంగాన్ని ఒక తాటి పైకి తీసుకొని వస్తాయన్నారు.
చిత్రనిర్మాత విద్యావేత్త, ముక్తా ఆర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సుభాష్ ఘాయ్ మాట్లాడుతూ వినోదాన్ని, జ్ఞానోదయాన్ని కలిగించే సినిమాను భారత ప్రజలు ప్రేమిస్తారని ఇది వారి జీవితంలో భాగంగా మారిపోయిందని అన్నారు. "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ చలన చిత్ర నిర్మాతల కేంద్రంగా గుర్తింపు పొందింది. భారతదేశ యువత ఉపాధి కోసం సినిమాను ఎంచుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు” అని ఆయన అన్నారు.
భారతదేశం సృజనాత్మక దేశంగా ప్రసిద్ది చెందిందని, భారతీయ కథలో స్థానికత కనిపిస్తుందని బాలాజీ టెలీఫిల్మ్స్ జాయింట్ ఎండి ఎంఎస్ ఏక్తా కపూర్ అన్నారు. భారతదేశ సినిమా రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని అన్నారు.
ఫిక్కీ ఫిల్మ్ ఫోరం కో-చైర్ ఉదయ్ సింగ్ మరియు ఎంపిఎ-ఇండియా ఎండి, కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
(Release ID: 1733204)
Visitor Counter : 231
Read this release in:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada