ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 24 గంటలలో 40,000 లోపు రోజువారీ కొత్త కేసులు


4,82,071 కు తగ్గిన చికిత్సలోని కేసులు, మొత్తం కేసుల్లో 1.58%

ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ కేసులు 35.28 కోట్లు

రోజువారీ పాజిటివిటీ 2.61%; 28 రోజులుగా 5% లోపే

Posted On: 05 JUL 2021 11:53AM by PIB Hyderabad

భారత దేశంలో గత 24 గంటల్లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 40 వేల లోపుకు  (39,796) వచ్చాయి. గత 8 రోజులుగా కొత్తకేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో ఇది సాధ్యమైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JLL7.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,82,071 మంది. చికిత్సలో

ఉన్నవారు నికరంగా 3,279 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.58% మాత్రమే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00272F1.jpg

 

భారత్ లో మొత్తం కోవిడ్ టీకా డోసుల సంఖ్య  35.28  కోట్లు దాటింది. ఇప్పటిదాకా 46,34,986  శిబిరాల ద్వారా 35,28,92,046

 టీకా డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటలలో 14,81,583 డోసులు ఇవ్వగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,29,388

రెండో డోస్

73,13,234

టీకా డోసులు

మొదటి డోస్

1,75,86,200

రెండో డోస్

96,69,322

18-44 వయోవర్గం

మొదటి డోస్

10,07,24,211

రెండో డోస్

27,77,265

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,07,90,116

రెండో డోస్

1,89,54,073

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,89,93,767

రెండో డోస్

2,58,54,470

మొత్తం

35,28,92,046

 

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 53 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.

గత 24  గంటలలో  42,352 మంది కోలుకున్నారు. 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032KBK.jpg

గత 24 గంటలలో  2,556 మంది అంతకుముందు రోజు కంటే అదనంగా కోలుకున్నారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049VHH.jpg

ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,97,00,430 మంది కాగా గత 24 గంటలలో 42,352 మంది కోలుకున్నారు.  దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 97.11% కు పెరిగింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IR0F.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 15,22,504 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన

మొత్తం పరీక్షలు 41.97 కోట్లకు పైగా (41,97,77,457) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  

తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.40కాగా రోజువారీ పాజిటివిటీ  2.61%  అయింది. వరుసగా 28 రోజులుగా  ఇది 5% లోపే ఉంటోంది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V8KW.jpg


(Release ID: 1732937) Visitor Counter : 184