మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

రేపు 'నైపుణ్య భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి

Posted On: 04 JUL 2021 12:14PM by PIB Hyderabad

చదివి అర్థం చేసుకోవడం  మరియు సంఖ్యాశాస్త్రంలో నైపుణ్యం సాధించేలా చూడడానికి పాఠశాలవిద్య అక్షరాస్యత శాఖ రేపటి నుంచి ( 2001 జులై 5) జాతీయ స్థాయిలో 'నైపుణ్య భారత్కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  'నైపుణ్య భారత్'   అమలు చేయడానికి రూపొందిన మార్గదర్శకాలతో పాటుకార్యక్రమ గీతం మరియు ఒక లఘు చిత్రాన్ని మంత్రి విడుదల చేస్తారు. కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పాఠశాల విద్యా శాఖ సీనియర్ అధికారులు, విద్య,అక్షరాస్యత విభాగం  సీనియర్ అధికారులు మరియు సంస్థల అధిపతులు కూడా హాజరుకానున్నారు.

2020 జులై 29వ తేదీన ప్రారంభమైన జాతీయ విద్యావిధానం 2020అమలులో భాగంగా పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో 'నైపుణ్య భారత్ముఖ్యమైన కార్యక్రమంగా ఉంటుంది. 

2026-27 నాటికి మూడవ తరగతి చదువు పూర్తయ్యే నాటికి పిల్లలందరూ చదవడం మరియు అంకెలను గుర్తించడంలో కనీస పరిజ్ఞానం కలిగి విద్యా సముపార్జన సాగించేలా చూడాలన్న లక్ష్యంతో 'నైపుణ్య భారత్కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేశంలో అయిదు అంచెల్లో అమలు చేస్తారు. జాతీయ-రాష్ట్ర-జిల్లా-బ్లాకు-పాఠశాల స్థాయిల్లో కార్యక్రమాన్ని పాఠశాల విద్యఅక్షరాస్యతా విభాగం అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర శిక్షణ పథకంలో భాగంగా 'నైపుణ్య భారత్కార్యక్రమం అమలవుతుంది. 


(Release ID: 1732674) Visitor Counter : 193