మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వ్యక్తుల అక్రమ రవాణా (నివారణ, సంరక్షణ మరియు పునరావాసం) బిల్లు, 2021 పై సలహాలు, సూచనలు కోరుతున్న - మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

Posted On: 04 JUL 2021 3:00PM by PIB Hyderabad

"వ్యక్తుల అక్రమ రవాణా (నివారణ, సంరక్షణ మరియు పునరావాసం) బిల్లు, 2021" ముసాయిదా బిల్లు పై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సహా భాగస్వాములు అందరి నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం, ఎదుర్కోవడం, బాధితులకు సంరక్షణ, భద్రత, పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో,  వారి హక్కులను గౌరవిస్తూ, వారికి సహకరించే విధంగా చట్టపరమైన, ఆర్థిక, సామాజిక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు నేరస్థులపై విచారణ జరిగేలా చూడటం మరియు దానికి సంబంధించిన లేదా యాదృచ్ఛికమైన విషయాల కోసం,  ఈ బిల్లును రూపొందించడం జరిగింది.  ఈ బిల్లు ఖరారైన తర్వాత, ఆమోదం కోసం, ముందుగా మంత్రి మండలికి,  అటు పిమ్మట, పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించడం జరుగుతుంది.  సరిహద్దు చిక్కులతో ఉన్న వ్యక్తుల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి నేరానికీ, ఈ చట్టం వర్తిస్తుంది.

పైన పేర్కొన్న ముసాయిదా బిల్లు పై మీ సలహాలు, సూచనలు 14.07.2021 లోపు santanu.brajabasi[at]gov[dot]in అనే ఇ-మెయిల్ ఐ.డి. కి పంపవచ్చు

ముసాయిదా కోసం దయచేసి క్రింది లింక్‌ ను నొక్కండి. 

https://wcd.nic.in/acts/public-notice-and-draft-trafficking-persons-prevention-care-and-rehabilitation-bill-2021

 



(Release ID: 1732673) Visitor Counter : 637