ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో 33.28 కోట్లకు పెరిగిన టీకా డోసుల పంపిణీ
గత 24 గంటల్లో 45,951 కొత్త కోవిడ్ కేసులు; ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 5,37,064; మొత్తం కేసుల్లో ఇవి 1.77% మాత్రమే
వరుసగా 3 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే
రోజువారీ పాజిటివిటీ 2.34%; 23 రోజులుగా 5% లోపే
Posted On:
30 JUN 2021 10:39AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు నిన్న 33 కోట్లు దాటాయి. 44,33,853 శిబిరాల ద్వారా33,28,54,527 టీకాలిచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలకు సమాచారం. గత 24 గంటలలో 36,51,983 టీకా డోసుల పంపిణీ జరిగింది.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,02,08,162
|
రెండో డోస్
|
72,43,081
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,74,84,539
|
రెండో డోస్
|
94,80,633
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
9,00,61,716
|
రెండో డోస్
|
20,87,331
|
45-59వయోవర్గం
|
మొదటి డోస్
|
8,82,70,464
|
రెండో డోస్
|
1,59,11,279
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
6,79,88,719
|
రెండో డోస్
|
2,41,18,603
|
మొత్తం
|
33,28,54,527
|
సార్వత్రిక కోవిడ్ టీకాల కార్యక్రమం 2021 జూన్ 16న ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం దీని వేగం పెంచటంతోబాటు పరిధి విస్తరించాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా అమలులోపెట్టింది.
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 45,951 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలా 50 వేల లోపు కేసులు రావటం వరుసగా ఇది మూడో రోజు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది.
చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య క్రమేణా తగ్గటం కూడా చూస్తున్నాం. ప్రస్తుతం 5,37,064 మంది కోవిడ్ చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో వీరి సంఖ్య నికరంగా 15,595 తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 1.77% మాత్రమే.
కోవిడ్ బారినుంచి బైటపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో రోజువారీ కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గత 48 రోజులుగా ఇదే ధోరణి కనబడుతోంది. గత 24 గంటలలో 60,729 మంది కోలుకున్నారు. అంతకు ముందు కంటే 14,778 మంది ఎక్కువగా కోలుకోవటం గమనార్హం.
కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,94,27,330 మంది కోలుకోగా గత 24 గంటల్లో 60,729 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం పెరుగుతూ ప్రస్తుతం అది 96.92% అయింది.
దేశవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల సామర్థ్యం బాగా పెరగగా, గత 24 గంటల్లో 19,60,757 పరీక్షలు జరిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 41.01 కోట్లకు పైగా (41,01,00,044) పరీక్షలు జరిగాయి. ఒకవైపు పరీక్షల సామర్థ్యం పెరుగుతూ ఉండగా ఇంకోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ 2.69% నమోదు కాగా రోజువారీ పాజిటివిటీ ఈ రోజు 2.34% గా నమోదైంది ఇది గత 23 రోజులుగా 5% లోపే ఉంటోంది.
(Release ID: 1731437)
Visitor Counter : 232
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam