ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించిన చ‌ర్య‌ల‌ పై ప్ర‌ధాన మంత్రి ట్వీట్ లు చేశారు


వైద్య రంగ మౌలిక స‌దుపాయాల లో ప్రైవేటు పెట్టుబ‌డి కి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది

బాల‌ల కు ఆరోగ్య సంర‌క్ష‌ణ సౌక‌ర్యాల ను ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డం పై శ్ర‌ద్ధ‌ వహించడం జరుగుతుంది

రైతుల కోసం, చిన్న‌ న‌వ పారిశ్రామిక‌వేత్తల కోసం, స్వ‌తంత్రోపాధి క‌లిగిన వ్య‌క్తుల కోసం అనేక కార్య‌క్ర‌మాలను అమలుపరచడం జరుగుతుంది

ఈ చ‌ర్య‌ లు ఆర్థిక కార్య‌క‌లాపాల కు వేగాన్ని అందించడం లోను, ఉత్ప‌త్తి ని, ఎగుమ‌తుల‌ ను పెంచడం లోను, ఉపాధి ని క‌ల్పించడం లోను సాయపడుతాయి: ప్ర‌ధాన మంత్రి

ఈ చ‌ర్య‌ల తో సంస్క‌ర‌ణల ను కొనసాగించాలన్న మా ప్ర‌భుత్వం వ‌చ‌న‌బ‌ద్ధ‌త వెల్లడి అవుతోంది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 28 JUN 2021 7:14PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రి ఈ రోజు న ప్ర‌క‌టించిన చ‌ర్య‌లు ఆర్థిక కార్య‌క‌లాపాల ను ఉత్తేజ ప‌ర‌చ‌డం కోసం, ఉత్ప‌త్తి ని, ఎగుమ‌తుల‌ ను పెంచ‌డం కోసం, ఉపాధి ని క‌ల్పించ‌డం కోసం సాయ‌ప‌డుతాయి అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం, బాల‌ల కు ఆరోగ్య సంర‌క్ష‌ణ సౌక‌ర్యాల క‌ల్ప‌న కోసం, రైతుల కోసం, చిన్న న‌వ పారిశ్రామికవేత్త ల కోసం, స్వ‌తంత్రోపాధి క‌లిగిన వ్య‌క్తుల కోసం చ‌ర్య‌ల ను తీసుకోవ‌డ‌మైంది అని ఆయ‌న నొక్కి చెప్పారు.

ప్ర‌ధాన మంత్రి అనేక ట్వీట్ ల‌లో ఈ కింది విధం గా పేర్కొన్నారు..

‘‘ఆర్థిక మంత్రి @nsitharaman ఈ రోజు న ప్ర‌క‌టించిన చ‌ర్య‌ లు ప్ర‌జారోగ్య సౌక‌ర్యాల ను, ప్ర‌త్యేకించి ఆ సౌక‌ర్యాల కు అంత‌గా నోచుకోని ప్రాంతాల లో, ఇనుమ‌డింప జేయ‌నున్నాయి.  అవి వైద్య రంగ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న లో ప్రైవేటు పెట్టుబ‌డి కి ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  అంతేకాదు, కీల‌క‌మైన మాన‌వ వ‌న‌రుల‌ ను పెంచుతాయి కూడాను.  మ‌న బాల‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల ను ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డం అనే అంశం పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకోవ‌డం జ‌రిగింది.

మన రైతుల కు సాయ‌ప‌డ‌టానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వ‌డ‌మైంది.  వారి కి ఖ‌ర్చుల ను త‌గ్గించ‌డానికి, వారి ఆదాయాల ను పెంచ‌డానికి, వ్య‌వ‌సాయ సంబంధిత కార్య‌క‌లాపాల లో దీర్ఘకాలిక‌త్వాన్ని స‌మ‌ర్ధించ‌డానికి అనేక కార్య‌క్ర‌మాల‌ ను ప్ర‌క‌టించ‌డమైంది.  

మ‌న చిన్న‌ న‌వ పారిశ్రామిక‌వేత్త‌ లు, స్వ‌తంత్రోపాధి క‌లిగిన వ్య‌క్తులు వారి వ్యాపార కార్య‌క‌లాపాల లో నిల‌దొక్కుకొనేందుకు వీలుగా, వాటి ని వారు మ‌రింత‌ విస్త‌రించుకొనేందుకు అద‌న‌పు మ‌ద్ధ‌తు ను ప్ర‌క‌టించ‌డ‌మైంది. ప‌ర్య‌ట‌న రంగం తో ముడిప‌డి ఉన్న వారికి సాయం చేయ‌డానికి గాను ఆర్థిక స‌హాయం స‌హా అనేక కార్య‌క్ర‌మాల ను తీసుకోవ‌డం జ‌రుగుతోంది.

ఆర్థిక కార్య‌క‌లాపాల ను ఉత్తేజ‌ ప‌ర‌చ‌డం లో, ఉత్ప‌త్తి ని, ఎగుమ‌తుల‌ ను పెంచ‌డంలో, ఉపాధి ని క‌ల్పించ‌డం లో ఈ చ‌ర్య‌ లు తోడ్ప‌డుతాయి.  ఫ‌లితాల‌ తో ముడిపెట్టిన విద్యుత్తు పంపిణీ ప‌థ‌కం, పిపిపి ప్రాజెక్టుల కోసం సువ్య‌వ‌స్థీకృత ప్ర‌క్రియ‌ లు, ఆస్తుల న‌గ‌దీక‌ర‌ణ‌.. ఇవి సంస్క‌ర‌ణ‌ ల ప‌ట్ల మా ప్ర‌భుత్వం వ‌చ‌న‌బ‌ద్ధ‌త ను కొన‌సాగిస్తోంద‌నే విషయాన్ని చాటుతున్నాయి.’’

 


ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్యాకేజీ తాలూకు ప్ర‌క‌ట‌న ను చూడ‌డం కోసం ఈ కింది లింకు ను సందర్శించగలరు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1730963 

 


(Release ID: 1731097) Visitor Counter : 184