ప్రధాన మంత్రి కార్యాలయం
సిర్ మౌర్ లో జరిగిన ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
28 JUN 2021 10:58PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ లో జరిగిన ఒక ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండేసి లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని అందించడం జరుగుతుందని పిఎమ్ఒ తరఫున చేసిన ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి తెలియజేశారు.
ఆ ట్వీట్ ఈ కింది విధం గా ఉంది:
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడం నన్ను వేదన కు గురి చేసింది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించడం జరుగుతుంది. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతుల ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి మోదీ.’’
***
(Release ID: 1731086)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam