ప్రధాన మంత్రి కార్యాలయం

రుషి బంకిమ్  చంద్ర చట్టోపాధ్యాయ్ గారి జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 27 JUN 2021 12:13PM by PIB Hyderabad

రుషి బంకిమ్  చంద్ర చట్టోపాధ్యాయ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘రుషి బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో  శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.  ఆయన తన సమగ్ర రచన ల మాధ్యమం ద్వారా, భారతదేశం సభ్యత గొప్పతనాన్ని చాటి చెప్పారు.  ఆయన రచించిన #వందేమాతరమ్  భారతదేశాని కి వినమ్రత తో సేవ చేయడానికి, మన తోటి భారతీయుల కు సాధికారిత ను అందించే దిశ లో మనలను మనం అంకితం చేసుకోవడానికి ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 (Release ID: 1730801) Visitor Counter : 56