ప్రధాన మంత్రి కార్యాలయం

అత్యవసర పరిస్థితి ని ప్రతిఘటించిన వారిని గుర్తుకు తెచ్చుకొన్న ప్ర‌ధాన మంత్రి


భారతదేశం ప్రజాస్వామిక స్ఫూర్తి ని పటిష్టపరచడం కోసం శాయశక్తుల కృషిచేస్తామని, అలాగే మన రాజ్యాంగం లో ప్రతిష్ఠించిన విలువల ను అమలు చేస్తామని ప్రతిన బూనుదాం రండి: ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 JUN 2021 10:52AM by PIB Hyderabad

అత్యవసర పరిస్థితి ని ప్రతిఘటించిన, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వారందరినీ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ఆత్యయిక స్థితి వార్షికోత్సవం నాడు ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఈ కింది విధం గా పేర్కొన్నారు.

‘‘ అత్యవసర పరిస్థితి తాలూకు చీకటి రోజులు ఎన్నటికీ మరచిపోలేనటువంటివి.  1975వ సంవత్సరం మొదలుకొని 1977వ సంవత్సరం వరకు ఉన్న కాలం సంస్థ ల క్రమానుగుణ వినాశనానికి సాక్షి గా నిలచింది.

భారతదేశం ప్రజాస్వామిక స్ఫూర్తి ని పటిష్టపరచడం కోసం శాయశక్తుల కృషిచేస్తామని, అలాగే మన రాజ్యాంగం లో ప్రతిష్ఠించిన విలువల ను అమలు చేస్తామని ప్రతిజ్ఞ ను స్వీకరించుదాం రండి.

ఈ రకం గా కాంగ్రెస్ మన ప్రజాస్వామిక సభ్యత ను అణగదొక్కింది.  ఇమర్జెన్సి ని విరోధించి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన మహానుభావులు అందరిని మనం జ్ఞప్తి కి తెచ్చుకొందాం.  #DarkDaysOfEmergency ’’


https://instagram.com/p/CQhm34OnI3F/?utm_medium=copy_link


(Release ID: 1730259) Visitor Counter : 200