ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 వాక్సినేషన్ః అపోహలు - వాస్తవాలు
రాష్ట్ర జనాభా, కేసుల భారం రాష్ట్ర వినియోగ సామర్ధ్యం, వృధా అంశాలపై ఆధారపడి పారదర్శకంగా వాక్సిన్ పంపిణీ జరుగుతుంది
Posted On:
24 JUN 2021 2:44PM by PIB Hyderabad
భారత దేశపు జాతీయ కోవిడ్ టీకాకరణ కార్యక్రమం శాస్త్రీయ, సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన ఆధారాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) మార్గదర్శకాలు, అంతర్జాతీయ ఉత్తమ వాడుక పై ఆధారపడి నిర్మించింది. ఇక పద్ధతి ప్రకారంగా. ఎండ్ టు ఎండ్ ప్రణాళికల ఆధారంగా, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రజల ప్రభావవంతమైన,, సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా అమలవుతోంది.
కోవిడ్ -19 వాక్సిన్లను పారదర్శకం కాని పద్ధతుల ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తున్నట్టు కొన్ని మీడియా నివేదికలు ఆరోపించాయి. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అర్థ సమాచారంతో కూడినవి.
భారత ప్రభుత్వం కోవిడ్ -19 వాక్సీన్లను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పూర్తిగా పారదర్శక రీతిలో అందిస్తోందని స్పష్టం చేయడమైంది. భారత ప్రభుత్వం ద్వారా వాక్సిన్ సరఫరా, రాష్ట్రాలు, యుటిల వినియోగం, మిగులు, రాష్ట్రాలు, యుటిల వద్ద వాడని వాక్సిన్ డోసుల లభ్యత, సరఫరా చేయబోయే వాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇతర సంస్థల ద్వారా విడుదల చేస్తున్న పత్రికా ప్రకటనలలో తెలియచేస్తున్నాం.
కోవిడ్ 19 వాక్సిన్ల పంపిణీ అన్నది దిగువన పేర్కొన్న పారామితులకు అనుగుణంగా చేయడం జరుగుతోందిః
1. రాష్ట్ర జనాభా
2. కేసులు లేదా వ్యాధి భారం
3. రాష్ట్రాల వినియోగ సామర్ధ్యం
వాక్సిన్ వృధా కారణంగా కేటాయింపు ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
*****
(Release ID: 1730181)