సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రసార భారతిలో 100% ఈ- ఆఫీస్ అమలు


కాగిత రహితంగా సాగుతున్న కార్యకలాపాలు

Posted On: 24 JUN 2021 1:47PM by PIB Hyderabad

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రసార భారతిలో కార్యకలాపాలు సరికొత్త రీతిలో సాగుతున్నాయి. రెండు సంవత్సరాలలో సంస్థ సరికొత్త రూపును సంతరించుకుంది.  దేశంలోని 577 దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలలో పనిచేస్తున్న దాదాపు 22,348 మంది సిబ్బంది ఈ-ఆఫీస్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 

కోవిడ్ మహమ్మారి సమయంలో విధించిన లాక్ డౌన్, ఆ తరువాత నెలకొన్న పరిస్థితి వల్ల  సిబ్బంది వివిధ పరిమితులకు లోబడి పనిచేయవలసి వచ్చింది. ఈ సమయంలో ఐటీ ఆధారిత ఈ-ఆఫీస్ వ్యవస్థ వారికి అనేక విధాలుగా ఉపయోగపడింది. 

కాగితాలతో పని లేకుండా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రసార భారతిలో 2019 ఆగస్టులో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టారు.  దేశంలో ఉన్న 577 ప్రసార భారతి కేంద్రాలలో 10% కేంద్రాలు 2019లో ( ఆగస్ట్-డిసెంబర్) ఈ-ఆఫీస్ అమలులోకి వచ్చింది. 2020లో 74% కేంద్రాల్లో ఈ విధానం అమలులోకి రాగా మిగిలిన 16% కేంద్రాల్లో ఈ-ఆఫీస్ ను అమలులోకి తీసుకుని వచ్చాయి. అత్యంత వేగంగా సమర్ధంగా సిబ్బంది ఈ-ఆఫీస్ వినియోగానికి అలవాటు పడడంతో ప్రసార భారతిలో 50వేల ఈ-ఫైల్స్ రూపుదిద్దుకున్నాయి. ఇవన్నీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అంతర్గతంగా సంబంధిత విభాగాలు ఈ ఫైళ్ల పరిస్థితిని తెలుసుకోగలుగుతున్నాయి.  

ఒక ఫైల్ పై తగిన చర్యను తీసుకోవడానికి బౌతికంగా పనిచేసినప్పుడు కనీసం వారం రోజులు పట్టేది. ఈ-ఆఫీస్ అమలులోకి రావడంతో ఈ సమయం సరాసరిన 24 గంటలకు తగ్గింది. ఒకోసారి కొన్ని గంటల వ్యవధిలో కూడా పని పూర్తవుతున్నది. 

ఈ-ఆఫీస్ వ్యవస్థ ప్రయోజనాలు ప్రసార భారతిలో కనిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రసార భారతి అనేక ఫైళ్లపై తుది నిర్ణయాన్ని తీసుకుని పరిష్కరించింది. నెలవారీగా పరిష్కరిస్తున్న ఫైళ్ల సంఖ్యా కూడా గణనీయంగా పెరిగింది. 

ఈ-ఫైళ్ల పరిష్కారంలో మొదటి పది స్థానాల్లో ఉన్న ప్రసార భారతి (ఆకాశవాణి-దూరదర్శన్) కేంద్రాలు.  

 

కార్యాలయాలు

ఆగస్టు, 2019 నుండి మొత్తం ఫై-ఫైల్స్ క్లియర్ చేయబడ్డాయి

ఆగస్టు, 2019 నుండి పారవేయబడిన ఇ-ఫైల్స్ యొక్క నెలవారీ సగటు

సీఈఓ  ఆఫీస్

11,186

500+

డిజి డిడి ఆఫీస్

6897

300+

డిజి ఆకాశవాణి  ఆఫీస్

5973

270+

డిజి డిడి న్యూస్ ఆఫీస్

3872

170+

డిజి ఆకాశవాణి  వార్తా కార్యాలయం

721

30+

టెక్నాలజీ హెడ్

3351

150+

హెచ్ ఆర్ హెడ్

13,331

600+

అడ్మిన్ హెడ్

6121

275+

ఆపరేషన్స్ హెడ్

2751

125+

హెడ్ ఆఫ్ ఫైనాన్స్

3533

160+

 

ఈ-ఆఫీస్ వ్యవస్థ  ప్రసార భారతి కార్యకలాపాలను కాగిత రహితంగా చేసింది. దీనితో  ఆగస్టు 2019 మరియు జూన్ 2021 మధ్య సంస్థ  కాగితంపై చేస్తున్న వ్యయాన్ని  45% వరకు ఆదా చేసింది. కార్భన ఉద్గారాలను  తగ్గించడం తో పాటు రిమోట్ వర్కింగ్, ఇంటి నుండి పని మొదలైన వాటి ద్వారా మహమ్మారి సమయంలో  భద్రతను మెరుగుపరిచింది. దీనితో  అంటువ్యాధులు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుంది. 



(Release ID: 1730024) Visitor Counter : 253