ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటిదాకా 29.35 కోట్లకు పైగా టీకా డోసులు;
రాష్ట్రాల దగ్గర పంపిణీకి సిద్ధంగా ఇంకా 2.14 కోట్ల డోసులు
Posted On:
22 JUN 2021 10:45AM by PIB Hyderabad
సార్వత్రిక టీకాల కార్యక్రమంలో కొత్త దశ నిన్న మొదలైంది. కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా టీకాల పరిధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చేయటానికి కృషి చేస్తోంది. దేశవ్యాప్త టీకాల కార్యక్రమాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జనవరి 16న ప్రారంభించారు. మరిన్ని టీకా డోసులు అందుబాటులోకి వస్తున్న కొద్దీ ఈ కార్యక్రమాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటు మీద సమాచారాన్ని ముందస్తుగా అందిస్తూ ప్రణాళికాబద్ధంగా టీకాల కార్యక్రమం నడవటానికి ప్రభుత్వం దోహదం చేస్తోంది.
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా టీకాలు అందిస్తోంది. సార్వత్రిక టీకాల తాజా దశలో అందుబాటులో ఉన్న మొత్తం టీకామందులో 75% ఉచితంగా అందిస్తుండగా మిగిలిన 25% ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంచింది.
భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 29.35 కోట్లకు పైగా (29,35,04,820) కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి ఈ ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి 27,20,14,523 డోసులు ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దగ్గర ఇంకా 2.14 కోట్లకు పైగా (2,14,90,297) టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. పైగా, మరో 33,80,590 టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుతాయి
***
(Release ID: 1729390)
Visitor Counter : 214
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam