మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, యోగా శాస్త్రంలో ఎన్‌ఐవోఎస్‌ డిప్లొమా కోర్సును ప్రారంభించిన శ్రీ సంజయ్ ధోత్రే

Posted On: 21 JUN 2021 5:40PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే యోగా శాస్త్రంలో ఎన్‌ఐవోఎస్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌) డిప్లొమా కోర్సును ప్రారంభించారు. కోర్సుకు సంబంధించిన స్వీయ శిక్షణ మెటీరియల్‌ను విడుదల చేశారు. విద్యార్థులకు ఈ విధమైన వృత్తిపర కోర్సులు అందిస్తున్నందుకు ఎన్‌ఐవోఎస్‌ను మంత్రి  అభినందించారు.

    కొవిడ్ సమయంలో యోగా ప్రాధాన్యతను స్పష్టీకరించిన శ్రీ ధోత్రే, యోగా కారణంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు. యోగా శాస్త్రం నేర్చుకుని ఉత్తీర్ణులైనవారు ఉద్యోగార్ధులుగా కాక, ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి ఈ కోర్సు సాయపడతుందని చెప్పారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిని మంత్రి గుర్తు చేశారు.

    రెండేళ్ల ఈ డిప్లొమా కోర్సులో, మొదటి సంవత్సరంలో, యోగా నేర్పడానికి సంబంధించి ఐదు అంశాల్లో శిక్షణ ఉంటుందని ఎన్‌ఐవోఎస్‌ చైర్‌పర్సన్ వెల్లడించారు. రెండో సంవత్సరంలో, యోగా చికిత్సకు సంబంధించి ఐదు అంశాలను బోధిస్తారని వివరించారు.
 

*****



(Release ID: 1729259) Visitor Counter : 145