ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

81 రోజుల తరువాత 60 వేల దిగువకు కొత్త కేసులు


గత 24 గంటల్లో 58,419 కరోనా కేసులు
దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 7,29,243కు తగ్గుదల
38 రోజులుగా కొత్తకేసులకంటే కోలుకున్నవారు అధికం
కోలుకున్నవారి శాతం 96.27% కు పెరుగుదల

రోజువారీ పాజిటివిటీ 3.22%; 13 రోజులుగా 5% లోపే

Posted On: 20 JUN 2021 10:11AM by PIB Hyderabad

కోవిడ్ విషయంలో భారత్ లో మరో ముఖ్యమైన ఘట్టం నమోదైంది. 81 రోజుల తరువాత రోజువారీ కొత్త కేసులు 60 వేలలోపు నమోదయ్యాయి. గత 24 గంటలలో  58,419 కొత్త కేసులు వచ్చాయి. ఆ విధంగా రోజురోజుకూ కేసులు తగ్గుతున్న ధోరణి స్పష్టంగా కనబడుతోంది. వరుసగా 10 రోజులుగా లక్షలోపే కేసులు నమోదవటం 13 రోజులుగా ఉండటానికి కారణం కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా జరుపుతున్న కృషే.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZJ0X.jpg

చికిత్సలో ఉన్న  కేసులు కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్నకేసులు 7,29,243. గత 24 గంటలలో నికరంగా  30,776  కేసులు తగ్గాయి.  మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 2.44% 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HLJN.jpg

ఎక్కువమంది కోవిడ్ నుంచి కోలుకుంటూ ఉండటంతో 38 రోజులుగా  కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో  87,619 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్త కేసులకంటే దాదాపు 29 వేల మంది ( 29,200) అధికంగా కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E8SZ.jpg

కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,87,66,009 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో   87,619 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం పెరుగుతూ ప్రస్తుతం 96.27% కు చేరుకుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00444NT.jpg

పరీక్షల సామర్థ్యం పెరుగుతూ ఉండగా గత 24 గంటలలో 18,11,446 పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య  39,10,19,083 కు చేరింది. పరీక్షలు పెరిగేకొద్దీ పాజిటివిటీ తగ్గుతోంది. వారపు పాజిటివిటీ 3.43% గా నమోదుకాగా రోజువారీ పాజిటివిటీ ఈ రోజు   3.22% ఉంది. 13 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005P0D8.jpg

ఇప్పటిదాకా 37,91,686 శిబిరాల ద్వారా  మొత్తం   27,66,93,572 టీకా డోసుల పంపిణీ జరిగినట్టు ఉదయం 7 గంటలవరకు అందిన సమచారం చెబుతోంది. గత 24 గంటల్లో ఇచ్చిన  38,10,554 టీకాల వివరాలు ఇవి:   

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,01,19,241

రెండో డోస్

70,65,889

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,71,08,593

రెండో డోస్

90,32,813

18-44వయోవర్గం

మొదటి డోస్

5,42,21,110

రెండో డోస్

12,27,088

45-59 వయోవర్గం

మొదటి డోస్

7,98,16,559

రెండో డోస్

1,26,54,117

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,44,21,583

రెండో డోస్

2,10,26,579

మొత్తం

27,66,93,572

 

 

***



(Release ID: 1728754) Visitor Counter : 204