సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నిబంధనలకు సవరణలు


టీవీ ప్రసారాలపై ప్రజల సమస్యలు / ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు

స్వీయ నియంత్రణ సంస్థలకు కేంద్రం గుర్తింపు

Posted On: 17 JUN 2021 6:34PM by PIB Hyderabad

టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం అవుతున్న అంశాలపై ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, వీటిపై అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టబద్ధమైన విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి వీలుగా కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం 1995 నిబంధనలకు అనుగుణంగా కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనలు 1994లో సవరణలు చేస్తూ కేంద్రం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

2. ప్రస్తుతం నిబంధనలను అతిక్రమిస్తూ ప్రసారం అవుతున్న కార్యక్రమాలు/ప్రకటనలపై ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను విచారించడానికి చట్టబద్ధమైన యంత్రాంగం అందుబాటులో లేదు. ఇంతేకాకుండా, ఫిర్యాదులను పరిష్కరించడానికి వివిధ ప్రసార సంస్థలు అంతర్గతంగా స్వీయ నియంత్రణ విధానాలను అమలు చేస్తున్నాయి. అయితే, సమస్యల పరిష్కార వ్యవస్థను సమర్ధంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని గుర్తించడం జరిగింది. తాము ఏర్పాటు చేసుకున్న సంఘాలు/సంస్థలకు చట్టపరంగా గుర్తించాలని కొన్ని ప్రసార సంస్థల నుంచి అభ్యర్థనలు కూడా అందాయి. "కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా మరియు  ఇతరులు" కేసులో  సుప్రీంకోర్టు (2000 యొక్క డబ్ల్యుపి (సి) నెం .387) వెలువరించిన తీర్పులో సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే దీనికి సంబంధించి  అవసరం అయ్యే నిబంధనలను రూపొందించాలని సూచించింది. 

3.  పేర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా పారదర్శకంగా పనిచేసే చట్టబద్దమైన యంత్రాంగానికి రూపకల్పన చేస్తూ కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనలను సవరించడం జరిగింది. ప్రసార సంస్థలు ఏర్పాటు చేసుకున్న స్వీయ నియంత్రణ సంస్థలను కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయబడతాయి. 

4. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 900కి పైగా టెలివిజన్ ఛానళ్లకు అనుమతులు మంజూరు చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం అమలు జరిగే ప్రసారాలు, ప్రకటనలకు సంబంధించిన కోడ్ కు లోబడి  ఈ సంస్థలు పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థను అందుబాటులోకి తేవడమే కాకుండా ప్రసార సంస్థలు, అవి నెలకొల్పిన స్వీయ నియంత్రణ సంస్థలు జవాబుదారీతనంతో మరింత సమర్ధంగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. 

 

 

Saurabh Singh



(Release ID: 1728002) Visitor Counter : 265