ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు8,26,740 కు తగ్గుదల; 71 రోజుల అత్యల్పం


గత 24 గంటల్లో 67,208 కొత్త కేసుల నమోదు
35 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే అధికం

కోలుకున్నవారి శాతం 95.93%కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 3.48%; పది రోజులుగా 5% లోపే

Posted On: 17 JUN 2021 10:31AM by PIB Hyderabad

రోజువారీ కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుదలబాటలో సాగుతూ ఉన్నాయి. గత 24 గంటలలో  67,208 కొత్తకేసులు వచ్చాయి.

పది రోజులుగా కొత్త కేసులు లక్షలోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TDE3.jpg

దేశంలో చికిత్సలో ఉన్న కేసులు కూడా తగ్గుతూ 8,26,740 కు చేరాయి. ఇవి 71 రోజుల అత్యల్పం. గత 24 గంటలలో నికరంగా

38,692 కేసులు తగ్గాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  2.78% మాత్రమే

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PYXX.jpg

ఎక్కువమంది కోలుకుంటూ ఉండటంతో కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం 35 రోజులుగా కనబడుతోంది. గత

24 గంటలలో 1,03,570 మంది కోలుకున్నారు.  గత 24 గంటలలో అంతకుముందు రోజుకంటే 36,362 మంది ఎక్కువ

 కోలుకున్నారు.

.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031RO1.jpg

ఇప్పటిదాకా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 2,84,91,670 కు చేరుకుంది. గత 24 గంటలలో 1,03,570 మంది

కోలుకున్నారు. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  95.93%.

                                   https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JKCA.jpg

పరీక్షల సామర్థ్యం పెంచటంతో మొత్తం గత 24 గంటలలో  19,31,249 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. దీంతో

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షలు 38,52,38,220 కు చేరుకున్నాయి. వారపు పాజిటివిటీ 3.99% కాగా రోజువారీ

 పాజిటివిటీ  నేడు 3.48% గా నమోదైంది. ఇది వరుసగా 10 రోజులుగా 5% లోపే ఉంటోంది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ME3T.jpg

 

దేశంలో ఇప్పటిదాకా వేసిన కోవిడ్ టీకాల సంఖ్య 26.55 కోట్లు దాటింది. I36,59,159 శిబిరాల ద్వారా 26,55,19,251 

టీకా డోసులు వేసినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

వివరాలు ఇలా ఉన్నాయి: 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,88,081

రెండో డోస్

70,17,838

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,69,56,515

రెండో డోస్

89,36,711

 18-44 వయోవర్గం

మొదటి డోస్

4,73,43,608

రెండో డోస్

9,69,085

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

7,79,22,224

రెండో డోస్

1,22,96,349

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,35,37,652

రెండో డోస్

2,04,51,188

మొత్తం

26,55,19,251

 

 

****



(Release ID: 1727981) Visitor Counter : 141